మలికిపురం: తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం దిండిలో గెయిల్ గ్యాస్ పైపు నిర్మాణ పనుల దృష్ట్యా 144 సెక్షన్ విధించారు. సుమారు 200 మంది పోలీసుల రక్షణ నడుమ పైప్‌లైన్ పనులను గెయిల్ సిబ్బంది ప్రారంభించారు. నగరం గ్యాస్ పైపులైన్ పేలుడు దుర్ఘటన తర్వాత గ్యాస్ సరఫరాలో ఆటంకం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో గ్యాస్ పైపులైనును తిరిగి నిర్మించాలని కేంద్రం ఆదేశించింది. అయితే, భారీ పేలుడు దుర్ఘటన అనుభవంతో దిండిలో పైప్‌లైను నిర్మాణ పనులకు స్థానిక రైతులు అభ్యంతరం చెప్పారు. దీంతో ఐదు నెలలుగా పనులు నిలిచిపోయాయి. తాజాగా కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలతో భారీగా పోలీసులను మోహరించి పనులను చేపట్టారు.