మొగల్తూరు: పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు పట్టణంలో సోమవారం ఉదయం జరిగిన ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానిక శ్రీ చైతన్య విద్యాసంస్థలకు చెందిన బస్సు మెయిన్ రోడ్డులోని ఓ మలుపులో రివర్స్ తీసుకుంటూ అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకుపోయింది. దీంతో ఇంట్లో ఉన్న తండ్రి, కూతురు నాగరాజు, మహాలక్ష్మిలు గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.