అసెంబ్లీలో కూడా టీడీపీ జెండా ఎగురవేస్తారా?
అసెంబ్లీలో కూడా టీడీపీ జెండా ఎగురవేస్తారా?
Published Fri, Dec 11 2015 1:40 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
బేతంచెర్ల: టీడీపీ నాయకులు బడి, గుడి, ప్రభుత్వ కార్యాలయాలనే తేడా లేకుండా పార్టీ జెండాలను ఎగరవేస్తుంటే అధికారులు అవేమి పట్టన్నట్లు వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ శ్రేణుల అత్యుత్సాహం చూస్తుంటే శాసనసభ మధ్యలో కూడా టీడీపీ జెండాను ఎగురవేశేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
ప్రస్తుతం టీడీపీ నాయకులు బడి ముందు జెండాలు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులు పాఠశాల బయటకు వస్తే జాతీయ జెండాను చూడాలా లేక టీడీపీ జెండాలను చూడాలా అని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పార్టీలు మార్చే వ్యక్తినంటూ తనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తనపై విమర్శలు చేసిన కేఈ ఎన్ని పార్టీల తీర్థం పుచ్చుకున్నారో తెలియదా అని ప్రశ్నించారు. ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పదవి ఇవ్వకపోతే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుస్తానని అనలేదా అని ఆయన గుర్తు చేశారు.
Advertisement
Advertisement