హైదరాబాద్: ఏపీ రాజధాని వ్యవహారాల్లో చంద్రబాబు సర్కార్ పారదర్శకంగా పనిచేయడం లేదని కాంగ్రెస్ నేతలు సి.రామచంద్రయ్య, శైలజానాథ్ లు విమర్శించారు. శనివారం వారిక్కడ మాట్లాడుతూ వందలాది జీవోలు రహస్యంగా ఎందుకు జారీ చేస్తున్నారని ప్రశ్నించారు. ఆ జీవోలను అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల్లో సభ ముందుంచాలని నేతలు డిమాండ్ చేశారు. సింగపూర్, ఏపీ ప్రభుత్వాలకు ఒప్పందాలుంటే బయట పెట్టాలన్నారు. రాజధాని నిర్మాణానికి రూ. 27 వేల కోట్లు ఎలా సమకూరుస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.