కాంగ్రెస్, తృణమూల్, బీజేడీల డిమాండ్
న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లును కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం పూర్తిగా ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్ పార్టీలు డిమాండ్ చేశాయి. దీనికి సంబంధించి బీజేపీ ఎంపీ ఎస్‌ఎస్ అహ్లూవాలియా నేతృత్వంలోని పార్లమెంట్ జాయింట్ కమిటీకి బీజేడీ, తృణమూల్ కాంగ్రెస్‌లు ఇదివరకే లేఖ రాశాయి. కాంగ్రెస్ పలు సిఫారసులను కమిటీకి సోమవారం సమర్పించనుంది.
ఈ బిల్లులోని వివిధ క్లాజ్‌లపై వోటింగ్ సందర్భంగా పార్టీలన్నీ బిల్లుకు వ్యతిరేకంగానే ఓటు వేస్తాయని భావిస్తున్నట్లు కాంగ్రెస్ నేత ఒకరు అన్నారు. భూములు కోల్పోయేవారికి నష్టపరిహారాన్ని పట్టణ ప్రాంతాల్లో నాలుగు రెట్లు, గ్రామీణ ప్రాంతాల్లో రెండు నుంచి నాలుగు రెట్లుగా ఉందని, దీనిని రెండు ప్రాంతాల్లోనూ సమానంగా మార్కెట్ ధరకు 4 రెట్లుగా చేయాలన్న తమ డిమాండ్‌కే ప్రభుత్వం అంగీకరించడం లేదన్నారు.
బిల్లును ఉపసంహరించుకోవాలని తృణమూల్ నేత ఒకరు స్పష్టం చేశారు. భూములను లాభదాయక ప్రాజెక్టులకు సేకరించినప్పుడు భూమిని కోల్పోయినవారిని అందులో వాటాదారులుగా చేర్చడంవంటి అంశాలకు బీజేడీ మద్దతు పలికింది.
భూ బిల్లును పూర్తిగా ఉపసంహరించుకోవాలి
Published Sun, Jul 26 2015 1:37 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement