
'వారి పాపాలను అసెంబ్లీలో వెల్లడిస్తా'
హైదరాబాద్: ఇరిగేషన్ ప్రాజెక్టులపై కాంగ్రెస్ పాపాలను అసెంబ్లీలోనే వెల్లడిస్తామని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖమంత్రి హరీష్ రావు అన్నారు. ప్రాణహిత- చేవెళ్ల ఎత్తుపై గత ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని విమర్శించారు. పక్కనున్న రాష్ట్రాలతో సఖ్యతగా ఉంటూ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తామని హరీష్ రావు తెలిపారు.