విశాఖ: విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం నుంచి ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఏజెన్పీ ప్రాంతంలో మంగళవారం అత్యధిక వర్షపాతం నమోదైంది. వర్షాలకు జి.మాడుగలలో నుర్మతి వద్ద కల్వర్టు, ఎప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.