హైదరాబాద్: జేఎన్టీయూ పరిధిలోని 25 అనర్హత కాలేజీలపై సోమవారం హైకోర్టులో విచారణ చేపట్టారు. సుదుపాయాలు లేని కాలేజీల్లో తనిఖీలు చేపట్టాలని హైకోర్టు జెఎన్టీయూకి ఆదేశించిన సంగతి తెలిసిందే. తనిఖీలు చేపట్టిన దర్యాప్తు రిపోర్టు ను అడ్వొ కేట్ జనరల్ హైకోర్టుకు సమర్పించారు. జేఎన్టీయూ పరిధిలోని ఆ కాలేజీలకు అర్హత లేదని అడ్వొకేట్ జనరల్ ఈసందర్భంగా హైకోర్టుకు తెలిపారు. కాలేజీలలో కొన్ని సదుపాయాలు మాత్రమే ఉన్నాయన్నారు. అందుకు సంబంధించిన విచారణ రిపోర్టును ఆయన హైకోర్టు కు అందించారు. కాగా రిపోర్టు పరిశీలించిన అనంతరం తుది తీర్పును హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.
కాగా సరైన సౌకర్యాలు, అనుమతులు లేని పలు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపును రద్దు చేయడాన్ని యాజమాన్యాలు హైకోర్టులో సవాలు చేశాయి. ఆ 25 కాలేజీలకు ఈ దఫా కౌన్సిలింగ్ కు అనుమతించాలని హైకోర్టు జేఎన్టీయూను ఆదేశించిన సంగతి తెలిసిందే. మళ్లీ తనిఖీలు చేసి తుది నివేదిక అందజేయాలని హైకోర్టు జేఎన్టీయూకు తెలిపింది.