సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆదేశించింది. సాగర్‌లో ప్రస్తుతం 507.10 అడుగుల వద్ద నీరుందని, 503.50 అడుగుల కింది వరకు వెళ్తే సుమారు 5.89 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని పేర్కొంది. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఏపీ తాగునీటి అవసరాలను తీర్చాల్సి ఉందని, అందుకు అనుగుణంగా నీటిని విడుదల చేయాలని సూచించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి ఆర్‌కే గుప్తా సోమవారం రాత్రి లేఖ రాశారు.
బోర్డు చైర్మన్‌కు వీడ్కోలు..
కృష్ణా బోర్డు చైర్మన్ నాథన్ పదవీకాలం మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా జలసౌధలోని బోర్డు కార్యాలయంలో అధికారులు ఆయనకు వీడ్కోలు పలికారు. నాథన్ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో గోదావరి బోర్డు చైర్మన్ రామ్‌శరణ్‌కే మరోమారు కృష్ణా బోర్డు తాత్కాలిక పగ్గాలను కేంద్రం అప్పగించే అవకాశం ఉంది.
ఏపీకి తాగునీరివ్వండి
Published Wed, Jun 1 2016 4:15 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM
Advertisement
Advertisement