దండేపల్లి (ఆదిలాబాద్ జిల్లా) : ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం కొలిమిచెలమ గ్రామానికి చెందిన అంకం శారద(27)ను ఆమె భర్త వెంకటేష్ గొంతునులిమి హతమార్చాడు. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. తన కుమార్తెను అల్లుడు వెంకటేష్ గొంతు నులిమి చంపాడని మృతురాలి తండ్రి స్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏడాది కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. దండేపల్లి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.