భార్య గొంతు కోసిన కసాయి భర్త | Man throat slits wife, fled | Sakshi
Sakshi News home page

భార్య గొంతు కోసిన కసాయి భర్త

Published Thu, Jun 9 2016 7:10 AM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

Man throat slits wife, fled

హైదరాబాద్: గర్భంతో ఉన్న అర్ధాంగి అన్న కనికరం లేకుండా ఓ కసాయి ఆమె గొంతు కోసిన దారుణ సంఘటన నగరంలోని లాలాగూడ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. లక్ష్మి, వెంకటేష్ దంపతులకు  ఏడాది కిందట వివాహం అయింది. స్థానిక నఫీజ్ ఫంక్షన్ హాల్లో పనిచేసుకుంటూ పక్క వీధిలో జీవనం సాగిస్తున్నారు. అయితే, బుధవారం రాత్రి ఫ్లై ఓవర్ సమీపంలో వెంకటేష్ తన భార్య లక్ష్మి గొంతు కోసి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement