ఎన్టీఎస్ఈ ఫలితాల్లో నారాయణ జయభేరి | narayana school students success in NTSE results | Sakshi
Sakshi News home page

ఎన్టీఎస్ఈ ఫలితాల్లో నారాయణ జయభేరి

Published Wed, Feb 17 2016 5:08 AM | Last Updated on Sun, Sep 3 2017 5:46 PM

narayana school students success in NTSE results

సాక్షి, హైదరాబాద్: నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్(ఎన్టీఎస్ఈ) స్టేజ్-1 ఫలితాల్లో నారాయణ విద్యార్థులు జయభేరి మోగించినట్లు ఆ విద్యాసంస్థల మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ పి.సింధూర నారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ప్రకటించిన ఫలితాల్లో టాప్ 5లో 4 ర్యాంకులు, టాప్ 10లో 12 ర్యాంకులను కైవసం చేసుకుని అత్యధిక సెలక్షన్లతో నంబర్ 1 స్థానం సాధించినట్లు ఆమె వెల్లడించారు. తమ విద్యార్థులైన కె.గంగావినోద్ స్టేట్ ఫస్ట్ మార్కు సాధించగా, ధీరజ్ చంద్ర మూడో ర్యాంకు, సాధిక్ ఆలీ నాల్గో ర్యాంకు, వి.మేఘన ఐదో ర్యాంకు సాధించినట్లు సింధూర పేర్కొన్నారు. ఈ సందర్భంగా సింధూర విలేకరులతో మాట్లాడుతూ స్కూల్ విద్యకు కొత్త విద్యా విధానాలు జోడించి సరికొత్త రీతిలో విద్యాబోధన కొనసాగిస్తున్నామని, అందుకు సాక్ష్యమే నేటి ఈ విజయాల పరంపర అని చెప్పారు. తరగతిలోని ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ వహించడం తమ ప్రత్యేకత అని వివరించారు. ఈ సందర్భంగా ఘనవిజయం సాధించిన విద్యార్థులను నారాయణ విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కె.పునిత్ ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement