
17న రాష్ట్రానికి రాష్ట్రపతి ప్రణబ్
హైదరాబాద్: రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 17న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రానికి రానున్నారు. 17, 18 తేదీల్లో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆయన బస చేయనున్నారు. 17న సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్ హోం’కార్యక్రమాన్ని నిర్వహించి రెండు రాష్ట్రాల రాజకీయ, అధికార, ఇతర రంగాల ప్రముఖులకు ఆతిథ్యం ఇవ్వనున్నారు.