సాగు నీరు అందించాలని రైతన్నలు ఆందోళనకు దిగారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలోని పలు గ్రామాలకు చెందిన సుమారు 500 మంది రైతులు సాగునీరు అందడం లేదని వాడపాలెం గ్రామంలోని అక్విడక్ట్ లాక్ సమీపంలో శనివారం ఆందోళనకు దిగారు. లాక్‌పై ఉన్న కాలువల ఆయకట్టు ప్రాంతానికి చెందిన రైతులు పంటలకు నీరివ్వాలని అధికారులను నిలదీస్తున్నారు.