నెల్లూరు నగరంలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు.
నెల్లూరు : నెల్లూరు నగరంలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారికి చెందిన రెండు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి.. తమదైన శైలిలో వారిని విచారిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ రూ. 50 లక్షలు వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.