సౌదీలో తెలంగాణ యువకుడి లాకప్‌డెత్?
సౌదీలో తెలంగాణ యువకుడి లాకప్‌డెత్?
Published Thu, Mar 2 2017 11:18 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
వికారాబాద్: మెరుగైన జీవనం కోసం విదేశాల బాటపట్టిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం ఇబ్రహీంపూర్ తండాకు చెందిన శ్రీనివాస్(26) మూడున్నరేళ్ల క్రితం సౌదీకి వెళ్లాడు. ఓ పాఠశాలలో బస్సు డ్రైవర్‌గా చేరాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ వాహనాన్ని వారం రోజుల క్రితం మరో వాహనం ఢీ కొట్టింది. దీంతో శ్రీనివాస్‌ను సౌదీ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌లో ఉన్న శ్రీనివాస్ మూడు రోజుల క్రితం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కాగా, గురువారం ఉదయం శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులకు సౌదీ పోలీసులు సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులే తమ కుమారుడిని హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారని ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడంతో పాటు నిజా నిజాలు తెలుసుకోవడానికి యత్నించాలని మృతుని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
Advertisement