పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వేర్వేరు చోట్ల పిడుగులు పడి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు.
నెల్లూరు: పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఆదివారం విస్తారంగా కురిసిన వర్షంతో పలుచోట్ల పిడుగులు పడ్డాయి. రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు.
చిల్లకూరు మండలం కోరువారిపాలెం వాసి ఉప్పుర వెదరయ్య, వరికుంటపాడు మండలం తొడుగుపాడుకు చెందిన నాగేశ్వరరావు (45)లు పిడుగుపాటుకు ప్రాణాలొదిలారు.