ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలంలోని ధర్మారం గ్రామ సమీపంలో సోమవారం పిడుగుపాటుకు ఇద్దరు మహిళా కూలీలు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.
జన్నారం: ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలంలోని ధర్మారం గ్రామ సమీపంలో సోమవారం పిడుగుపాటుకు ఇద్దరు మహిళా కూలీలు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.
ధర్మారం గ్రామానికి గుమ్ముల భీమక్క(40), కల్లెడ సత్తవ్వ(30), కల్లెడ నర్సవ్వ, చిట్యాల పోశవ్వ గ్రామ సమీపంలోని శివయ్య పత్తి చేనులో కలుపు తీయడానికి వెళ్లారు. మధ్యాహ్నం వర్షం పడుతుండడంతో చెట్టు కిందకు వెళ్లారు. అదే సమయంలో పిడుగు పడడంతో భీమక్క, సత్తవ్వ మృతి చెందారు. పక్కనే ఉన్న పోశవ్వ, నర్సవ్వ స్పృహకోల్పోయూరు. వీరిని అంబులెన్స్‌లో జన్నారం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా కోలుకున్నారు.