సాక్షి ప్రతినిధి, విజయనగరం : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమా లు నిర్వహించారు. చీపురుపల్లిలో వైఎస్ విగ్రహానికి ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, పార్లమెంట్ పరిశీలకులు బేబినాయన, బెల్లాన చంద్రశేఖర్, మజ్జి శ్రీనివాసరావు తదితరులు పూలమాలలువేసి నివాళులు అర్పించారు. టీటీడీ కల్యాణ మండపం ఆవరణలో మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరాలను నిర్వహించారు. మజ్జి శ్రీనివాసరావు, వలిరెడ్డి శ్రీనివాసుల నాయుడు రక్తదానం చేశా రు. ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఆధ్వర్యంలో సాలూరు బోసుబొమ్మ జంక్షన్‌లో వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ముందుగా వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదపిల్లల ఆశ్రమంలో మిఠాయిలు పంచిపెట్టారు. ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. కురుపాం రావాడ కూడలిలో ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి, ఎంపీపీ ఇందిరా కుమారి, జెడ్పీటీసీ పద్మావతి వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేసి వృద్ధులకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. గరుగుబిల్లిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు.
నెల్లిమర్లలో వైఎస్ విగ్రహాలకు పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ సురేష్‌బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శు లు అంబళ్ల శ్రీరాములనాయుడు, , కె.వి. సూర్యనారాయణరాజు, డీసీసీబీ వైస్ చైర్మన్ చనుమళ్ల వెంకటరమణ, రైతు విభాగం అధ్యక్షుడు శంకరసీతారామారాజు, జెడ్పీటీసీ గెదల సన్యాసినాయుడులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక మారుతీ నర్సింగ్‌హోంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలగట్ల రోగులకు రొట్టెలు పంపిణీ చేశారు. డెంకాడలో జరిగిన కార్యక్రమంలో కోలగట్ల, సాంబశివరాజు,సురేష్‌బాబు పాల్గొన్నారు. భోగాపురంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, కాకర్లపూడి శ్రీనివాసరాజు, ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
వైఎస్‌ఆర్ విగ్రహం ఆవిష్కరణ
బొబ్బిలి పట్టణానికి సమీపంలోని గొల్లపల్లిలో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాన్ని శ్రీకాకుళం పార్లమెంటరీ నియెజకవర్గ పరిశీలకులు బేబీనాయన, మర్రాపు జగన్నాథం ఆవిష్కరించారు. అదే ప్రాంగణంలో మొక్కలు నాటారు. 66 మంది వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. గజపతినగరంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైఎస్ జయంతి వేడుకలు నిర్వహించారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. విజయనగరం పట్టణంలో వైఎస్సార్ జయంతి వేడుకలను పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లయన్స్‌క్లబ్ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి కె.వి.ఎన్. తమ్మన్నశెట్టి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో యడ్ల రమణమూర్తి, ఆశపు వేణు, ఎస్.వి. రాజేష్, సంగిరెడ్డి బంగారునాయుడు, నడిపేను శ్రీను పాల్గొన్నారు. పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అవనాపు విజయ్, పిళ్లా విజయకుమార్ తదితరులు వైఎస్సార్ కూడలి వద్ద ఉన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్వతీపురం నియెజకవర్గ ఇన్‌చార్జి జమ్మాన ప్రసన్న కుమార్, మజ్జి వెంకటేష్, గర్భాపు ఉదయభాను ఆధ్వర్యంలో మోటారు సైకిల్‌ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఏరియా ఆస్పత్రిలో పండ్లు, రొట్టెలు పంపిణీ చేసిన నాయకులు, అనంతరం రక్తదానం చేశారు. శృంగవరపుకోట నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త నెక్కల నాయుడుబాబు ఆధ్వర్యంలో చీడివలస,కొత్తవలస జంక్షన్‌లలో వైఎస్ విగ్రహాలకు పాలాబిషేకం చేశారు. స్థానిక ఆంజనేయపేటలో ఉన్న చైతన్య బదిరుల మానసిక వికలాంగుల పాఠశాలలోని విద్యార్థులకు స్వీట్లు పుస్తకాలు పంపిణీ చేశారు. మానసిక వికలాంగులతో కేక్‌ను కట్ చేయించారు. స్థానిక పీహెచ్‌సీలో రోగులకు రొట్టెలు పంపిణీ చేశారు. సేవ, వితరణ కార్యక్రమాల దినంగా వైఎస్‌ఆర్ జయంతిని జరుపుకొన్నారు.
వైఎస్సార్‌కు సేవా నివాళి
Published Thu, Jul 9 2015 12:39 AM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM
Advertisement