మిర్యాలగూడ కౌన్సిలర్‌పై దాడి | yuvajana congress mandal committee in miryalaguda | Sakshi
Sakshi News home page

మిర్యాలగూడ కౌన్సిలర్‌పై దాడి

Published Sat, Aug 22 2015 12:02 PM | Last Updated on Sun, Sep 3 2017 7:56 AM

yuvajana congress mandal committee in miryalaguda

మిర్యాలగూడ: యువజన కాంగ్రెస్ మండల కార్యవర్గ ఎన్నికల సందర్భంగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వివరాలు...స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు యువజన కాంగ్రెస్ మండల కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉంది. అయితే, 9 గంటలకే అక్కడికి చేరుకున్న శ్రేణులు బాహాబాహీకి దిగాయి. ఈ కొట్లాటలో పట్టణ కౌన్సిలర్ ఇలియాస్‌ పై ప్రత్యర్థి వర్గం దాడికి దిగింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన కౌన్సిలర్లు అక్కడికి చేరుకుని, ఆయనకు మద్దతు తెలిపారు. దాడికి పాల్పడిన వారిని శిక్షించకుంటే పదవులకు రాజీనామా చేస్తామని 22 మంది కౌన్సిలర్లు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement