ఫివర్‌లో 37 కుక్కకాటు కేసులు
హైదరాబాద్: నగరంలో కుక్కకాటుకు గురవుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. బుధవారం ఒక్క రోజే నగరంలోని ఫీవర్ ఆస్పత్రిలో 37 కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. వీరిలో పదేళ్లలోపు చిన్నారులు 15 మంది ఉన్నారు.
వీరందరికి వైద్యులు రిగ్ ఇంజక్షన్ ఇచ్చి పంపేశారు. అదే విధంగా ఓపీ విభాగంలో 508 మంది రోగులు వైద్య చికిత్సలు పొందగా వీరిలో 30 మందిని ఇన్ పేషంట్లుగా చేర్చుకుని చికిత్సలు అందిస్తున్నామని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.