ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధులు పెంచాలి
పార్లమెంటరీ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి చేపడుతున్న పథకాలకు కేంద్రం నుంచి మరిన్ని నిధులు సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ ఇటీవల రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయా ప్రతిపాదనలను ప్రభుత్వం నివేదించింది. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న డబుల్ బెడ్‌రూం పథకంలో భాగంగా ప్రతి ఏటా రెండు లక్షల ఇళ్లకు తక్కువ కాకుండాకేంద్రం 50 శాతం సబ్సిడీ (ఒక్కో ఇంటికి రూ. 3 లక్షల మేర) మంజూరు చేసేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కోరింది. ఈ పథకంలో ఎస్సీలకు 17 శాతం, ఎస్టీలకు 7 శాతం తక్కువకాకుండా ఇళ్లు కేటాయిస్తున్నట్లు తెలిపింది.
అక్షరాస్యత, అదనంగా మరిన్ని ఎస్సీ, ఎస్టీ గురుకులాల ఏర్పాటు, ఐటీడీఏలు లేనిచోట్ల గిరిజనుల సంక్షేమానికి చర్యలు, ఇతర పథకాలకు అదనపు నిధులను కేంద్ర నుంచి సాధించాలని రాష్ట్ర సర్కారు భావి స్తోంది. ఎస్సీ,ఎస్టీలకు అందిస్తున్న సేవలు ఆయా వర్గాలకు చేరేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయో గించుకోవాల్సి ఉందని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీల స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన పథకాలకు రాష్ట్రానికి ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను పెంచాలని కోరింది.
‘డబుల్ బెడ్‌రూం’కు 50 శాతం సబ్సిడీ
Published Wed, Jan 27 2016 3:02 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement