
డ్రంక్ అండ్ డ్రైవ్ : 557 మందిపై కేసు నమోదు
హైదరాబాద్ : న్యూఇయర్ సందర్భంగా గురువారం రాత్రి హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 557 మంది మందుబాబులపై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారి శుక్రవారం వెల్లడించారు. న్యూ ఇయర్ సందర్భంగా గురువారం రాత్రి 10.00 గంటల నుంచి ఆర్థరాత్రి రెండు గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించినట్లు చెప్పారు.