
ఇకనుంచి ప్రతిరోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
హైదరాబాద్ : హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరంలో కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చారు. ట్రాఫిక్ పోలీసులు ఇప్పటివరకూ వీకెండ్స్లో మాత్రమే డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే శనివారం నుంచి కొత్త రూల్ను ప్రవేశపెట్టారు. ఇక నుంచి ప్రతిరోజూ మిట్టమధ్యాహ్నం ప్రధాన కూడళ్లలో డ్రంకన్ డ్రైవ్ సోదాలు చేపట్టనున్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్లో ఈరోజు మధ్యాహ్నం ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.