వాష్‌ రూంలో విద్యార్థిని ఆత్మహత్య | a student committed suicide in Wash room | Sakshi
Sakshi News home page

వాష్‌ రూంలో విద్యార్థిని ఆత్మహత్య

Published Sat, Aug 27 2016 12:47 AM | Last Updated on Tue, Nov 6 2018 8:04 PM

వాష్‌ రూంలో విద్యార్థిని ఆత్మహత్య - Sakshi

వాష్‌ రూంలో విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్: శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా వడ్డేపల్లి మండలం తుమ్మల గ్రామానికి చెందిన కొల్లూరి శివశంకర్‌రెడ్డి కూతురు అన్వితారెడ్డి (17) హైదరాబాద్ ఎల్‌బీనగర్ ఎస్‌బీహెచ్ కాలనీలోని శ్రీచైతన్య ఐఐటీ అకాడమీలో ఇంటర్మీడియెట్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. 3వ అంతస్తులో స్నేహితురాలు సాయినిఖితతో కలసి ఉంటోంది. శుక్రవారం తరగతికి వెళ్లి.. మధ్యలో కడుపునొప్పి వస్తోందని గదికి వచ్చింది.

బాత్‌రూమ్‌లోని గీజర్ రాడ్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తరగతి పూర్తయిన తరువాత గదికి వచ్చిన సాయినిఖిత.. బాత్‌రూమ్ తలుపు ఎంత కొట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి యాజమాన్యానికి తెలిపింది. వెంటనే సిబ్బంది బాత్‌రూమ్ తలుపులు పగులగొట్టి చూడగా అన్వితారెడ్డి ఉరివేసుకుని కనిపించింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం కామినేని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. కాగా ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదు.

అన్వితారెడ్డి తన పుస్తకంలో ‘‘గెలిచినప్పుడు జ్ఞాపకాలు మిగులుతాయి... గెలుస్తామో, ఓడతామో తెలియని ప్రేమలో పడితే కన్నీరు తప్ప ఏమీ మిగలదు’’ ‘‘నువ్వు ఇష్టపడే వాళ్లకంటే నిన్ను ఇష్టపడే వాళ్లనే కోరుకో’’... లాంటి కొటేషన్లతో ఉన్న లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థిని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 
విద్యార్థి సంఘాల ధర్నా...
విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న పలు విద్యార్థి సంఘాలు కళాశాల వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. విద్యార్థిని ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యమే కారణమని.. కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం గ్రేటర్ అధ్యక్షుడు బత్తుల నాని, టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చిలుక మధుసూదన్‌రెడ్డి, ఏబీవీపీ, టీఆర్‌ఎస్‌వీ, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు ఆందోళన చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement