శామీర్‌పేట్, న్యూస్‌లైన్: దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రతి ఒక్కరూ వీర సైనికుడి వలే తయారు కావాలని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ( సీఐఎస్‌ఎఫ్) డెరైక్టర్ జనరల్ రాజీవ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు రక్షణ ఇవ్వడమే కాకుండా రాబోయే రోజుల్లో నక్సలిజాన్ని అణిచివేయడానికి నిసా శిక్షకులు సన్నద్ధం కావడం హర్షణీయమని పేర్కొన్నారు.
శుక్రవారం ఉదయం హకీంపేట్‌లోని నేషనల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ అకాడమీ(నిసా)లో సీఐఎస్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్, ఎల్‌డీసీఈ, ఎస్‌ఐలుగా శిక్షణ పూర్తి కావడంతో పాసింగ్ అవుట్ పేరేడ్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వచ్చిన డీజీ రాజీవ్ రక్షణ దళం ఇచ్చిన గౌరవ వందనాన్ని స్వీకరించి ప్రసంగించారు. అనంతరం శిక్షణకాలంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన కమాండర్‌లకు ప్రశంసా పత్రాలను అందించారు. అంతకుముందు నిసా డెరైక్టర్ అనీల్‌కుమార్ స్వాగతోపాన్యాసం చేశారు.
విజేతలు వీరే...
నిసాలో జరిగిన శిక్షణ కాలంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేసి వారికి ప్ర సంశాపత్రాలతో పాటు మెమొంటోలను ము ఖ్యఅతిథి చేతుల మీదుగా బహుకరించారు. విజేతల్లో 39వ బ్యాచ్‌సబ్‌ఇన్‌స్పెక్టర్‌లలో మొ దటి ర్యాంకు మహమూద్( బెస్ట్ ఇన్ ఫైరింగ్(షూటింగ్‌విభాగం),సుజిత్‌కుమార్ (బెస్ట్ ఇన్ అవుట్‌డోర్‌ట్రయినింగ్), ప్రకాశ్‌సింగ్(బెస్ట్ ఇన్ ఇండోర్ ట్రయినింగ్), కపిల్‌దేవ్(ఆల్ రౌండ్ బెస్ట్), 7వ బ్యాచ్ అసిస్టెంట్ కమాం డెంట్( ఎల్‌డీసీఈ) విభాగంలో భన్వర్‌లాల్ (ఆల్ రౌండ్ బెస్ట్), 27వ బ్యాచ్ అసిస్టెంట్ క మాండెంట్ విభాగంలో అఖిలేష్‌కుమార్( బెస్ట్ ఇన్‌ఫైరింగ్), వికాస్‌కుమార్(బెస్ట్ అవుట్‌డోర్ ట్రయినింగ్), అఖిలేష్‌కుమార్ (బెస్ట్ ఇన్ ఇన్‌డోర్ ట్రయినింగ్), అఖిలేష్‌కుమార్(ఆల్ రౌండ్ బెస్ట్)లుగా నిలిచారు. కార్యక్రమం లో ఏడీ పీఐడీ రత్నాకర్ పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ వీరసైనికుడు కావాలి
Published Sat, Oct 26 2013 4:36 AM | Last Updated on Fri, Sep 1 2017 11:58 PM
Advertisement
Advertisement