
బైబై
‘భారతదేశం విజ్ఞాన సౌధం. ఈ దేశ పౌరులుగా గర్వపడాలి. సాధికారత ద్వారానే దేశాభివృద్ధి సాధ్యం’.... ఈ మాటలు ఇంకా అక్కడి వారి చెవుల్లో మార్మోగుతున్నాయి. ఈ మాటలు పలికిన వ్యక్తి రూపం ఇంకా వారి కళ్ల ముందు కదలాడుతూనే ఉంది.
నగరంలో చివరిసారిగా కుత్బుల్లాపూర్‌లోని బహదూర్‌పల్లిలో గల టెక్ మహీంద్ర ఎకోల్ సెంట్రల్ (ఎంఈసీ) కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్‌లో 2015 మే 14న నిర్వహించిన కార్యక్రమంలో అబ్దుల్ కలాం పాల్గొన్నారు. అక్కడి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు.