
అడ్డంగా కోసేస్తున్నారు
గ్రేటర్ హైదరాబాద్‌లో ఆహార భద్రత కార్డు కోత కొనసాగుతునే ఉందిఘ
కొనసాగుతున్న ఆహార భద్రత కార్డుల తొలగింపు
ఎనిమిది నెలల్లో 2.43 లక్షల కార్డులు రద్దు
పేదల పరేషాన్ సర్కిల్ ఆఫీసుల చుట్టూ చక్కర్లు
సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో ఆహార భద్రత కార్డు కోత కొనసాగుతునే ఉంది, కార్డుల ఏరివేత నిలిపివేయాలని సాక్షాత్తు పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ అనంద్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా వడబోత ప్రక్రియ మాత్రం ఆగడం లేదు. మరోవైపు రద్దరుునా అర్హుల కార్డుల పునరుద్దరణ మాత్రం నత్తలకు నడక నేర్పిస్తోంది. ఎనిమిదినెలల వ్యవధిలో సుమారు 2.43 లక్షల కార్డులు రద్దయ్యారుు. అనర్హులతో పాటు అర్హుల కార్డులు, యూనిట్లు సైతం రద్దుకావడంతో పేదల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇదీ లెక్క..
గ్రేటర్ పరిధిలో సుమారు 12 పౌరసరఫరాల సర్కిళ్లు ఉన్నారుు. ఈ ఏడాది ఏప్రిల్‌లో 13.57 లక్షల కార్డులు, అందులో 44.74 లక్షల యూనిట్లు ఉండగా, తాజాగా కార్డుల సంఖ్య 11.14 లక్షలు, యూనిట్ల సంఖ్య 39.07 లక్షలకు చేరింది. అంటే 2.43 లక్షల కార్డులు, 5.67 లక్షల యూనిట్లు కోతకు గురయ్యారుు. జిల్లాల పునర్విజన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతం మూడుముక్కలు కాగా, హైదరాబాద్‌లో పాత తరహాలోనే తొమ్మిది సర్కిల్స్ యథావిధిగా ఉండగా, మేడ్చల్‌లో రెండు, రంగారెడ్డిలో ఒక సర్కిల్స్ గ్రేటర్ పరిధిలో చేరారుు. ప్రస్తుతం మేడ్చల్‌లో బాలనగర్ సర్కిల్-1 లో 1, 90, 322 కార్డులు, 6,36,303 యూనిట్లు, ఉప్పల్ సర్కిల్-2 లో 1,62,218 కార్డులు, 5, 30, 174 యూనిట్లు ఉన్నారుు. రంగారెడ్డి అర్బన్‌లోని సరూర్‌నగర్ సర్కిల్‌లో 1,84, 389 కార్డులు, 6,12,475 యూనిట్లు ఉన్నారుు.
అందరూ ఒకే గాటికి...
పౌరసరఫరాల శాఖ అనర్హులు, అర్హులను ఒకే గాటికి కట్టి వేటు వేస్తోంది. నిబంధనల ప్రకారం కార్డు పొందేందుకు అనర్హులైనా, ఆరోగ్య శ్రీ, ఫీజు రీరుుంబర్స్‌మెంట్ వంటి ప్రభుత్వ పథకాల కింద అర్హత పొందవచ్చునన్న ఆశతో కొందరు ఆహార భద్రతా కార్డులు తీసుకున్నారు.మరోవైపు డీలర్లు సైతం చేతివాటాన్ని ప్రదర్శించారు. అధికారులు సైతం క్షేత్రస్థారుులో పరిశీలించకుండానే అనర్హులకు కార్డులు మంజూరు చేశారు. వీటిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అధికారులు దిద్దుబాటు పనిలో పడ్డారు. తాజాగా ఆధార్ అనుసంధానంతో స్వంత ఆస్తులు, వాహనాలు, వ్యాపారాలు కలిగి ఉన్నారన్న సాకుతో ఆహార భద్రత కార్డులపై వేటు వేస్తున్నారు. అందులో సగానికి పైగా అర్హత కలిగిన నిరుపేద కుటుంబాలు కావడం విస్మయానికి గురిచేస్తోంది. బహుళ ప్రయోజన కారి ఆధార్ పేదల పాలిట శాపమైంది. కుటుంబంలో ఏ ఒక్కరిపై వాహనం ,వ్యాపారం ఉన్నట్లు గుర్తించినా కార్డు రద్దవుతోంది.
ఉపాధి కోసం ఫైనాన్‌సపై నాలుగు చక్రాల పెద్ద వాహనాలు కొనుగోలు చేసిన కుటుంబాలు సైతం సంపన్నుల జాబితాలో చేరిపోయారు. వాస్తవంగా పౌరసరఫరాల శాఖ బోగస్ కార్డుల ఏరివేతలో భాగంగా గత రెండునెలలుగా అనర్హుల పై దృష్టి సారించింది. స్వంత ఇళ్లు, వ్యాపారాలు, వాహనాలు కలిగి ఉన్న వారిని గర్తించేందుకు జీహెచ్‌ఎంసీ,ఆర్టీఏ, వాణిజ్య పన్నుల తదితర శాఖల నుంచి వివరాలను సేకరించింది. వాటిని ఈ-పీడీఎస్ తో అనుసంధానం చేసి వారి కార్డులను తొలగింస్తోంది. సంపన్నులతో పాటు పేదలు సైతం అడ్డంగా వేటుకు గురయ్యారు.