ఆదిలాబాద్@41 డిగ్రీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రా చలం, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండల్లో 40 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
హన్మకొండ, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, రామగుండంలో 39 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. హైదరాబాద్‌లో సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా, ఖమ్మంలో 4 డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రత రికార్డయింది. వచ్చే 4 రోజులు పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.