మంజీరకు మూడేళ్ల తర్వాత జలకళ | After three years water water Manjeera river | Sakshi
Sakshi News home page

మంజీరకు మూడేళ్ల తర్వాత జలకళ

Published Fri, Sep 16 2016 7:58 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

After three years water water Manjeera river

రెండుమూడేళ్లుగా వర్షాలు లేక బోసిపోయిన మంజీర నది గురువారం ఉదయం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని సాలూర గ్రామ శివార్లో నీటితో కళకళలాడింది. ఉదయం నుంచి నదిలో నీటి ప్రవాహం పెరుగుతూ వస్తోందని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటి వరకు నీటి ప్రవాహం లేకపోవడంతో మంజీర నది ఇసుక, బండరాళ్లతో దర్శనమిచ్చిందని, నాలుగు రోజులుగా స్థానికంగా, ఎగువన కర్ణాటకలో కురుస్తున్న వర్షంతో నదిలో నీరు చేరిందని గ్రామస్తులు పేర్కొన్నారు. నీటి ప్రవాహాన్ని చూసేందుకు నదిపైన గల పాత,కొత్త వంతెనలపై జనాల సందడి నెలకొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement