ఆగాఖాన్ ఫౌండేషన్, ఆంటారియో ప్రావిన్స్ కలిసి విద్యార్థులకు విదేశీ విద్యను అందించేందుకు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందుకోసం ఫౌండేషన్ ఛైర్మన్ ఆగాఖాన్, ఆంటారియో ప్రావిన్సు ప్రీమియర్ కథ్లీన్ వైనీ ఈ ఒప్పందం మీద సంతకాలు చేశారు. ఈ రెండింటి భాగస్వామ్యంతో విద్యతో పాటు విద్యాబోధనకు కూడా మంచి ఊతం అందుతుందని ఈ సందర్భంగా ఆగాఖాన్ అన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే రెండు సంయుక్త ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చించారు.
విద్యార్థులకు ఆంటారియో నుంచి ట్యూషన్ స్కాలర్షిప్పులు అందించే కార్యక్రమం వాటిలో ఒకటి. ఈ స్కాలర్షిప్పుతో ప్రపంచంలోనే అత్యుత్తమ యూనివర్సిటీలలో ఉన్నత విద్య అభ్యసించే అవకాశం విద్యార్థులకు ఏర్పడుతుంది. దీంతో వాళ్ల కుటుంబాలు, సమాజం కూడా బాగుపడుతుందన్న ఆశాభావం వ్యక్తమైంది. ఇక రెండో కార్యక్రమంలో భాగంగా.. ఆంటారియోలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఆగాఖాన్ అకాడమీలో తమ సమయాన్ని వెచ్చిస్తారు. ఇలా వివిధ దేశాల మధ్య బోధన, నేర్చుకోవడం లాంటివి పంచుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని కెనడాకు చెందిన లీసా గెర్వాయిస్ అనే ఉపాధ్యాయిని చెప్పారు. ప్రస్తుతం ఆమె భారత్, కెన్యాలలో ఉన్న ఆగాఖాన్ అకాడమీలలో కెనడియన్ డెవలప్మెంట్ ఎక్స్ఛేంజి కార్యక్రమంలో భాగంగా పనిచేస్తున్నారు.
విదేశీ చదువుకు ఆగాఖాన్ అకాడమీ సాయం
Published Thu, May 28 2015 7:22 PM | Last Updated on Sun, Sep 3 2017 2:50 AM
Advertisement