సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూ మళ్లీ పంజా విసురుతోంది. చలితీవ్రతకు హెచ్1ఎన్1 వైరస్ మరింత బలపడినట్లు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేవలం 4 రోజుల్లోనే మూడు కేసులు నమోదయ్యాయి. వీరిలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శనివారం సాయంత్రం అపోలో ఆస్పత్రిలో మృతి చెందారు. ప్రస్తుతం రెయిన్‌బో ఆస్పత్రిలో ఓ చిన్నారి కూడా చికిత్స పొందుతోంది. పాజిటివ్ కేసుల వివరాలే కాదు కనీసం మృతుల వివరాలు కూడా వైద్య, ఆరోగ్య శాఖకు అందడం లేదు. బాధితులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రుల్లో స్వైన్‌ఫ్లూ నోడల్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆయా కేంద్రాల్లో సరైన వసతులు లేకపోవడమే కాదు వైద్యసేవల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుంది. దీంతో కొంతమంది రోగులు గాంధీ నుంచి డిశ్చార్జ్ చేయించుకుని కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.
ఇంకా అదుపులోకి రాని డెంగీ
అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 497 డెంగీ కేసులు నమోదు కాగా, 153 మలేరియా కేసులు నమోదయ్యాయి. గత ఐదేళ్లతో పోలిస్తే ఈ ఏడాదిలోనే అత్యధిక డెంగీ కేసులు నమోదు కావడమే కాదు సుమారు 60 మంది మృతి చెందడం గమనార్హం. పలు కార్పొరేట్ ఆస్పత్రు లు సాధారణ జ్వరాలను సైతం డెంగీ జాబితా లో చేరుస్తూ రోగులను మోసం చేస్తున్నాయి.
ముక్కుకు మాస్కు తప్పనిసరి
స్వైన్‌ఫ్లూ అనేది హెచ్1ఎన్1 వైరస్ వల్ల వ్యాపిస్తుంది. గాలిలోకి వచ్చిన వైరస్ 3 గంటల పాటు సజీవంగా ఉం టుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపి స్తుంది. జ్వరం, తలనొప్పి, ముక్కు కారడం, దగ్గు వంటి లక్షణాలు. ఈ వైరస్ వ్యాధి నిరో ధక శక్తి తక్కువగా ఉన్న చిన్నపి ల్లలు, వృద్ధు లు, గర్భిణులు, బాలింతలకు సులభంగా వ్యాపించే అవకాశం ఉంది. వీరు జనసమూ హంలోకి వెళ్తే ముక్కుకు మాస్క్ ధరించాలి.
–డాక్టర్ రాజన్న, చిన్నపిల్లల వైద్యనిపుణుడు
మళ్లీ స్వైన్‌ఫ్లూ కలకలం
Published Mon, Dec 19 2016 3:11 AM | Last Updated on Wed, Jun 13 2018 8:02 PM
Advertisement
Advertisement