హైదరాబాద్: హెచ్‌వోడీలతో జవహర్ రెడ్డి కమిటీ సమావేశం ముగిసింది. రాజధానికి శాఖల తరలింపుపై జవహర్ రెడ్డి కమిటీ హెచ్‌వోడీలతో గురువారం సమావేశమైంది. ఈ సమావేశంలో రాజధానికి అన్ని శాఖలు తరలివెళ్లాల్సిందేనని జవహర్ రెడ్డి కమిటీ స్పష్టం చేసింది. వారం తర్వాత మిగిలిన శాఖాధిపతులతో భేటీ కానుంది.
ఇందులో భాగంగా హెచ్‌ఆర్‌ఏ, స్థానికత అంశాలపై ప్రధాన కార్యదర్శితో కమిటీ చర్చించనున్నట్టు పేర్కొంది. 15 రోజుల తర్వాత శాఖల తరలింపుపై ప్రభుత్వానికి జవహర్ రెడ్డి కమిటీ నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం.
'రాజధానికి అన్ని శాఖలు తరలివెళ్లాల్సిందే'
Published Thu, Dec 3 2015 7:58 PM | Last Updated on Sun, Sep 3 2017 1:26 PM
Advertisement
Advertisement