యుధ్ధం
⇒ ముగిసిన నామినేషన్ల
⇒ ఉపసంహరణ ఘట్టం
⇒ బరిలో 1,333 మంది వీరులు
⇒ అస్త్రశస్త్రాలతో పార్టీలు సిద్ధం
సిటీబ్యూరో: గ్రేటర్ ఎన్నికల మహా సమరంలో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉప సంహరణలు పూర్తయ్యాయి. మొత్తంగా 1,333 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. వీరు వచ్చే నెల 2న జరుగనున్న పోలింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ వివరాలను గురువారం రాత్రి జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి, కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.
చివరి రోజైన గురువారం 1,214 మంది అభ్యర్థులు ఉపసంహరించుకోగా... 1,333 మంది బరిలో ఉన్నట్టు చెప్పారు. కడపటి సమాచారం మేరకు అత్యధికంగా జంగమ్మెట్ వార్డు నుంచి 28 మంది, సూరారం నుంచి 21 మంది, ఈస్ట్ ఆనంద్‌బాగ్ నుంచి 18 మంది, రామంతాపూర్, బాలాపూర్‌ల నుంచి 17 మంది వంతున బరిలో మిగిలారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చావుని డివిజన్‌లో పోటీలో లేరు.