నేటితో ముగియనున్ననామినేషన్ల ఉపసంహరణ | GHMC nominations withdraw end at 3 o clock tommorrow | Sakshi
Sakshi News home page

నేటితో ముగియనున్ననామినేషన్ల ఉపసంహరణ

Published Thu, Jan 21 2016 6:13 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

GHMC nominations withdraw end at 3 o clock tommorrow

హైదరాబాద్: జీహెచ్ఎంసీ నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం మూడు గంటలకు ముగియనుంది. కాగా, ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫామ్ అందలేదు. మరోపక్క, ఈ రాత్రిలోగా అసెంబ్లీ సెగ్మెంట్ కాంగ్రెస్ ఇంఛార్జ్ లకు బీఫామ్లు చేరనున్నాయి. పార్టీ ఖరారు చేసిన అభ్యర్థులకు ఈ రోజు ఉదయం బీఫామ్ లు చేరనున్నాయి. ఇక ఇంఛార్జ్ లు లేని సికింద్రాబాద్, కూకట్ పల్లి సెగ్మెంట్ బాధ్యతను ఎంపీలు అంజన్ కుమార్, సర్వే సత్యనారాయణకు అప్పగించనున్నారు.

నామినేషన్లు వేసిన కాంగ్రెస్ పార్టీ అనధికార అభ్యర్థులు గురువారం మధ్యాహ్నంలోగా నామినేషన్లను ఉపసంహరించుకోవాలని టీపీసీసీ ఆదేశించింది. ఆదేశాలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు ఉంటాయని టీపీసీసీ స్పష్టం చేసింది. 150 డివిజన్లకు 134 మందిని మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. 16 సెగ్మెంట్లలో కొన్నిచోట్ల కాంగ్రెస్ టికెట్లను టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ రెబల్ అభ్యర్థులకు ఇచ్చే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement