'గ్రేటర్లో గులాబీ జెండా ఎగురవేస్తాం' | minister mahender reddy speaks over greater elections | Sakshi
Sakshi News home page

'గ్రేటర్లో గులాబీ జెండా ఎగురవేస్తాం'

Published Sun, Jan 17 2016 5:41 PM | Last Updated on Sun, Sep 3 2017 3:48 PM

'గ్రేటర్లో గులాబీ జెండా ఎగురవేస్తాం'

'గ్రేటర్లో గులాబీ జెండా ఎగురవేస్తాం'

రాయదుర్గం: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయడాన్ని ఎవరూ ఆపలేరని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్‌లోని ఖాజాగూడలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కొమిరిశెట్టి సాయిబాబా నామినేషన్ దాఖలు సందర్భంగా ఆదివారం నిర్వహించిన ర్యాలీని మంత్రి ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పది డివిజన్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పనులను చూసి ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టతారని చెప్పారు. కాగా, గచ్చిబౌలి డివిజన్‌లోని టీఆర్‌ఎస్ ఘనవిజయం సాధిస్తుందని ఎంపీ జితేందర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ర్యాలీలో పాల్గొన్న ఆయన... ప్రజల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement