'కాపులు, బీసీలు ఇద్దరికీ న్యాయం చేయాలి'
హైదరాబాద్: కాపులు, బీసీలు ఇద్దరికీ న్యాయం చేయాలని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో కాపు ఐక్యగర్జన సభ సందర్భంగా జరిగిన ఘటనలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బుధవారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.
- తునిలో జరిగిన ఘటనలకు వైఎస్ఆర్ సీపీ, జగన్ కారణమని తప్పుడు ప్రచారం చేస్తున్నారు
- కాపులు శాంతపరులని, హింసకు పాల్పడరంటూనే.. చంద్రబాబు సర్కార్ కాపు నేతలపై ఎందుకు కేసులు పెట్టింది?
- తునిలో విధ్వంసం చేసింది టీడీపీ వాళ్లే
- టీడీపీలో కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులున్నారు. వారికి కాపుల కోటాలో పదవులు వచ్చాయి
- కీలక సమయంలో టీడీపీకి చెందిన కాపు నేతలు ఉద్యమాన్నినీరుగార్చవద్దు
- చంద్రబాబుకు మద్దతుగా నిలిచి చరిత్ర హీనులుగా మిగలొద్దు
- కాపుల్లో చీలిక తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు
- మరో వైపు బీసీలను రెచ్చగొడుతున్నారు
- కాపులను, బీసీలను విడదీసి వీరి మధ్య వైరాన్ని సృష్టిస్తున్నారు
- కాపులు, బీసీలు ఇద్దరికీ న్యాయం చేయాలి
- కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇవ్వలేదా?
-
కాపు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న కృష్ణయ్య అప్పుడే చంద్రబాబును ఎందుకు నిలదీయలేదు
టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణయ్య ఆ పార్టీ మేనిఫెస్టోను గౌరవించాలి - జస్టిస్ కేఎల్ మంజునాథ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఏపీ బీసీ కమిషన్ విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదు
- బిసి కమిషన్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేదు