ఒకే ఒక్క నామినేషన్.. ఎన్నిక లాంఛనమే
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎంఐఎం అభ్యర్థి అమీనుల్ హసన్ జాఫ్రీ ఎన్నిక ఇక లాంఛనప్రాయమే. నామి నేషన్లకు చివరి రోజైన మంగళవారం వరకు ఈ నియోజకవర్గానికి కేవలం జాఫ్రీ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఖరారైనట్లే. సాంకేతికంగా ఎన్నికల ప్రక్రియ పూర్తికావడమే ఇక మిగిలింది. నామినేషన్ సందర్భంగా జాఫ్రీని బలపరచిన వారిలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మలక్‌పేట ఎమ్మెల్యే బలాలా, మేయర్ బొంతు రామ్మోహన్ ఉన్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఎంఐఎం, టీఆర్‌ఎస్ మిత్రపక్షంగా కొనసాగుతుండటం తెలిసిందే. బల్దియా ఎన్నికల్లో ఎవరికి వారుగా పోటీ చేసినప్పటికీ, పాలకమండలిలో సైతం కలసిమెలసి సాగుతుండటం తెలిసిందే. పరస్పర సహకారాన్ని అలాగే కొనసాగిస్తూ టీఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికల్లో స్వతంత్రంగానే గెలవగల బలం ఉన్నప్పటికీ, జాఫ్రీని గెలిపించేందుకు ఆ పార్టీ నుంచి ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. ప్రస్తుతం ఈ నియోజకవర్గ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న జాఫ్రీ గడువు మే ఒకటిన ముగిసిపోనుండటంతో ఈ ఎన్నిక నిర్వహిస్తున్నారు. గతంలోనూ జాఫ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
‘స్థానిక’ ఎమ్మెల్సీ జాఫ్రీ!
Published Wed, Mar 1 2017 4:42 AM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM
Advertisement
Advertisement