Aminul Hasan Jafri
-
అసెంబ్లీలో గాంధీ వర్ధంతి
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసన మండలి ప్రొటెమ్ చైర్మన్ అమీనుల్ హసన్ జాఫ్రీ శాసనసభ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మండలిలో ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్‌రావు, అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహా చార్యులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీగా తాతా మధు ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన తాతా మధుసూదన్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ అమీనుల్ హసన్ జాఫ్రి తాతా మధుతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి శాసనసభా వ్యవహారాల శాఖమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మంత్రి సత్యవతి రాథోడ్, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెలంగాణ లెజిస్లేచర్ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తదితరులు హాజరయ్యారు. -
‘స్థానిక’ ఎమ్మెల్సీ జాఫ్రీ!
ఒకే ఒక్క నామినేషన్.. ఎన్నిక లాంఛనమే సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎంఐఎం అభ్యర్థి అమీనుల్ హసన్ జాఫ్రీ ఎన్నిక ఇక లాంఛనప్రాయమే. నామి నేషన్లకు చివరి రోజైన మంగళవారం వరకు ఈ నియోజకవర్గానికి కేవలం జాఫ్రీ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఖరారైనట్లే. సాంకేతికంగా ఎన్నికల ప్రక్రియ పూర్తికావడమే ఇక మిగిలింది. నామినేషన్ సందర్భంగా జాఫ్రీని బలపరచిన వారిలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మలక్‌పేట ఎమ్మెల్యే బలాలా, మేయర్ బొంతు రామ్మోహన్ ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఎంఐఎం, టీఆర్ఎస్ మిత్రపక్షంగా కొనసాగుతుండటం తెలిసిందే. బల్దియా ఎన్నికల్లో ఎవరికి వారుగా పోటీ చేసినప్పటికీ, పాలకమండలిలో సైతం కలసిమెలసి సాగుతుండటం తెలిసిందే. పరస్పర సహకారాన్ని అలాగే కొనసాగిస్తూ టీఆర్ఎస్కు ఈ ఎన్నికల్లో స్వతంత్రంగానే గెలవగల బలం ఉన్నప్పటికీ, జాఫ్రీని గెలిపించేందుకు ఆ పార్టీ నుంచి ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. ప్రస్తుతం ఈ నియోజకవర్గ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న జాఫ్రీ గడువు మే ఒకటిన ముగిసిపోనుండటంతో ఈ ఎన్నిక నిర్వహిస్తున్నారు. గతంలోనూ జాఫ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.