హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీం కేసుకు సంబంధించి సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) శుక్రవారం తాజా సమాచారాన్ని విడుదల చేసింది. ఇప్పటివరకూ నయీం కేసు వ్యవహారంలో 62 కేసులను నమోదు చేశామని వెల్లడించింది. తాజాగా మరో పదిమందిని అరెస్ట్ చేశామని సిట్ పేర్కొంది. కోరుట్లలో ఒకరు, భువనగిరిలో తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపింది. నయీం గ్యాంగ్ లో కీలక వ్యక్తి ఎమ్డీ అహ్మద్ ఖాన్ను కోరుట్లలో అరెస్ట్ చేశారు.
చిన్నబత్తిని బెంజ్మిన్, కాసాని ఇంద్రసేన, గుమ్మడెల్లి మల్లేష్ను కూడా అరెస్ట్ చేసినట్టు సిట్ అధికారులు తెలిపారు. కనుకుంట్ల శ్రీకాంత్, రావుల సురేష్, గడ్డం జంగయ్య, రాకల శ్రీనివాస్, సందెల ప్రవీణ్ కుమార్, మహ్మద్ యూనస్ లను అరెస్ట్ చేసినట్టు వెల్లడించింది. భువనగిరిలో అరెస్టైన తొమ్మిది మంది పలు నేరాల్లో భాగస్వాములగా తేల్చింది. పాశం శీనుతో కలిసి కిడ్నాప్లు, అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని సిట్ పేర్కొంది.
నయీం కేసులో మరో 10 మంది అరెస్ట్: సిట్
Published Fri, Sep 2 2016 7:46 PM | Last Updated on Tue, Oct 16 2018 9:08 PM
Advertisement