CIT officials
-
ఎన్నికల హింస కేసులో 54 మంది అరెస్టు
నరసరావుపేట: పల్నాడు జిల్లాలో ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న హింసపై గురువారం సిట్ కేసుల్లో 13 మందితో పాటు పోలింగ్‌కు ముందు, ఆ తర్వాత జరిగిన సంఘటనలకు సంబంధించి నమోదైన కేసుల్లో 54 మందిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ మలికా గార్గ్ వెల్లడించారు. ఎన్నికల నేరాల్లో ఈ ఒక్క రోజే తొమ్మిది మందికి 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చామన్నారు. నరసరావుపేట సబ్ డివిజన్లో ఒకరు, సత్తెనపల్లి సబ్ డివిజన్ లో 46 మంది, గురజాల సబ్ డివిజన్లో 27 మందితో కలిపి 74 మందిని బైండోవర్ చేశామన్నారు.నరసరావుపేట సబ్ డివిజన్లో ఐదుగురిపై రౌడీషీట్స్ ఓపెన్ చేసి, ఎన్నికల సమయంలో ట్రబుల్ మాంగర్స్గా గుర్తించినట్లు ఎస్పీ గార్గ్ తెలిపారు. బైండోవర్ చేసిన వారిలో నిబంధనలు ఉల్లంఘించిన ఐదుగురిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చేందుకు నోటీసులు ఇచ్చారు. 102 సీఆర్పీసీ సెక్షన్లో ఒక వాహనాన్ని సీజ్ చేశామన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.పాల్వాయిగేటు ఎన్నికల సిబ్బందిపై వేటుఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలంలోని పాల్వాయి గేటు 202వ పోలింగ్ స్టేషన్లో చోటుచేసుకున్న పరిణామాలపై ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులపై వేటు పడింది. ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించిన సత్తెనపల్లి జీజేసీ జూనియర్ కాలేజ్ జూనియర్ లెక్చరర్ పీవీ సుబ్బారావు, పోలింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించిన వెంకటాపురం జిల్లా పరిషత్ హైస్కూలు స్కూలు అసిస్టెంట్ షేక్ షహనాజ్ బేగంలను ఎన్నికల విధుల ఉల్లంఘన కారణంగా విధుల నుంచి తొలగిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్ బి లత్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ముగ్గురు ఉపాధ్యాయుల సస్పెన్షన్దర్శి: ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ వారికి ఓటు వేసేందుకు పోస్టల్ బ్యాలెట్‌కు రూ.5 వేలు లంచం తీసుకున్న కేసులో ముగ్గురు ఉపాధ్యాయులను కలెక్టర్ దినేష్‌కుమార్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో గుత్తా నారాయణ, గోవిందు, అరుణకుమారి ఉన్నారు. -
కచ్చితంగా ‘పచ్చ’ కుట్రే!
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటమే ఏకైక లక్ష్యంగా పోలింగ్ సందర్భంగా టీడీపీ విధ్వంస కాండకు బరి తెగించిందని పూర్తి ఆధారాలతో బట్టబయలైంది. వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతోపాటు మహిళలు, వృద్ధులను ఓటింగ్‌కు దూరం చేసేందుకు టీడీపీ పక్కా పన్నాగంలో దాడులకు తెగబడి విధ్వంసం సృష్టించిందని స్పష్టమైంది. అందుకు సంబంధించి వీడియో రికార్డింగులు, ఫొటోలతో సహా కీలక ఆధారాలను సిట్ సేకరించింది. పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలో యథేచ్ఛగా సాగిన టీడీపీ గూండాగిరీపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వరుసగా రెండో రోజు ఆదివారం విచారణ నిర్వహించింది. సిట్ ఇన్చార్జ్గా ఉన్న అదనపు డీజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలోని బృందం అనంతపురం జిల్లా తాడిపత్రితో పర్యటించగా, ఇతర బృందాలు పల్నాడు, తిరుపతి జిల్లాల్లో పర్యటించి విచారణ నిర్వహించాయి. దాడులు, దౌర్జన్యాలతో భీతిల్లిన ప్రాంతాలను పరిశీలించాయి. పోలీసులు నమోదు చేసిన కేసుల వివరాలను పరిశీలించడంతోపాటు బాధితుల అభిప్రాయాలు తెలుసుకున్నాయి. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు టీడీపీ ఎంత పక్కాగా పన్నాగాన్ని అమలు చేసిందన్న దానిపై సిట్ అధికారులు ఓ అంచనాకు వచ్చినట్టు సమాచారం. దాడులను అరికట్టడంలో పోలీసుల వైఫల్యంపై కూడా సిట్ అధికారులు ఓ నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. బాధితులతో మాట్లాడి దాడులు ఎలా జరిగాయన్నది తెలుసుకోవడంతోపాటు కీలకమైన వీడియో, ఫొటో ఆధారాలను సేకరించారు. ప్రధానంగా పల్నాడు, అనంతపురం జిల్లాల్లో పోలీసులు టీడీపీకి కొమ్ము కాసినట్టు.. బాధితులు ఫోన్లు చేసినా సరే స్పందించకుండా ఉదాసీనంగా వ్యవహరించినట్టు నిగ్గు తేలింది. పోలింగ్ రోజున, తరువాత హింసాత్మక ఘటనలపై విచారణ ప్రక్రియను రెండు రోజుల్లో ముగించాలని ఈసీ స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ రెండు రోజుల విచారణ ద్వారా తాము గుర్తించిన అంశాలతో ప్రాథమిక నివేదికను సిట్ ఇన్చార్జ్ వినీత్ బ్రిజ్‌లాల్ ఈసీకి సోమవారం సమర్పించనున్నారు. పూర్తి స్థాయి విచారణకు మరింత సమయం కావాలని ఆయన కోరే అవకాశం ఉంది.అక్రమాలకు పాల్పడటమే లక్ష్యంగా విధ్వంసంపక్కా పన్నాగంతో దాడులకు తెగబడి ఎన్నికల అక్రమాలకు పాల్పడాలన్నదే టీడీపీ కుట్రన్నది బట్టబయలైంది. అందుకోసమే పల్నాడు నుంచి అనంతపురం జిల్లా వరకు వరుస దాడులతో టీడీపీ శ్రేణులు బీభత్సం సృష్టించాయి. ప్రశాంతమైన తిరుపతి జిల్లాలో టీడీపీ ఏ విధంగా దాడులకు తెగబడిందీ వెలుగులోకి వచ్చింది. చిత్తూరు నుంచి రప్పించిన 2 వేల మంది రౌడీలతో చంద్రగిరి నియోజకవర్గంలోని కూచువారిపల్లెలో టీడీపీ విధ్వంసం.. రామిరెడ్డిపాలెం సర్పంచ్ చంద్రశేఖర్‌రెడ్డిని హత్య చేసేందుకు బరితెగించి దాడులకు పాల్పడిన కుతంత్రం.. అనంతరం తిరుపతిలోని ఎస్వీయూ, శ్రీపద్మావతి విశ్వవిద్యాలయాల ప్రాంతాల్లో దాడులు, ప్రతిదాడులకు సంబంధించిన కీలక ఆధారాలను సిట్ సేకరించింది. తిరుపతి రూరల్ మండలం ఎం ఆర్పల్లి సీఐపై టీడీపీ నేతలు రాడ్లతో దాడి చేస్తే, ఎందుకు కేసు నమోదు చేయలేదని సిట్ అధికారులు ప్రశ్నించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ దాడిపై కూడా కేసు నమోదు చేసి బాధ్యులను అరెస్ట్ చేయాలని ఆదేశించింది. రెండు కేసుల్లో కూడా నిందితులు అందరినీ అరెస్ట్ చేయాలని స్పష్టం చేసింది. తాడిపత్రిలో అయితే టీడీపీ గుండాగిరికి ఏకంగా పోలీసులే దన్నుగా నిలవడం.. పోలీసులే దాడులకు పాల్పడి ఆస్తులు ధ్వంసానికి పాల్పడిన వీడియో, ఫొటో ఆధారాలను సిట్ సేకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.– పల్నాడు జిల్లా పమిడిపాడు గ్రామంలోని వైఎస్సార్సీపీ పోలింగ్ బూత్ ఏజంట్ షేక్ మాబుపై టీడీపీ వర్గీయుల దాడి, ఉప్పలపాడులో ఇరువర్గాల దాడులు, ప్రతిదాడులు, దొండపాడు గ్రామంలో వాహనాలపై దాడి ఘటనల వెనుక టీడీపీ పక్కా పన్నాగం కూడా బట్టబయలైంది. ఈ ఘటనల వీడియోలను పరిశీలించి దాడుల తీవ్రతపై సిట్ అధికారులు ఓ అంచనాకు వచ్చారు. మాచర్ల నియోజకవర్గం కారెంపూడిలో బీసీ వర్గీయులపై టీడీపీ గుండాలు యథేచ్చగా సాగించిన దాడులు, దాచేపల్లిలో టీడీపీ వర్గీయులు తెగబడి సృష్టించిన విధ్వంసకాండ వెనుక కుట్ర వెలుగులోకి వచ్చింది. పోతురాజుగుట్టలో బేడ బుడగ జంగాల కాలనీపై జరిగిన దాడిని ఆ తర్వాత 14వ తేదీ ఉదయం నుంచి రాత్రి వరకు కారెంపూడిలో వరుసగా టీడీపీ రౌడీ మూకలు సాగించిన విధ్వంసాలకు సంబంధించిన వీడియో ఆధారాలను సేకరించారు.ఇవిగో ఆధారాలు..– పోలింగ్ రోజున పక్కా పన్నాగంతోనే టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని బాధితులు సిట్‌కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కేవలం ఫిర్యాదులు చేయడమే కాకుండా అందుకు సంబంధించిన వీడియో రికార్డులు, ఫొటోలను సాక్షంగా సిట్ అధికారులకు సమర్పించారు. చంద్రగిరి నియోజకవర్గంలో విధ్వంసకాండకు నాంది పలికిన కూచువారిపల్లిలో టీడీపీ సృష్టించిన బీభత్సం గురించి బాధితులు సిట్ అధికారులకు వివరించారు. – రామిరెడ్డిపల్లి సర్పంచ్ కొటాల చంద్రశేఖర్‌రెడ్డిని అంతమొందించే కుట్రలతోనే టీడీపీ వర్గీయులు దాడులకు పాల్పడ్డారని స్థానికులు సిట్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కారును తగలబెట్టిన ఘటన మొదలు సర్పంచ్ కొటాల చంద్రశేఖర్‌రెడ్డి ఇల్లు, కారు ధ్వంసం చేసి, నిప్పటించడం వరకు విధ్వంసకాండ కొనసాగిన తీరును విడమరచి చెప్పారు. సర్పంచ్ ఇంట్లోని వృద్ధురాలిని బలవంతంగా బయటకు ఈడ్చుకొచ్చారన్నారు. ఇంట్లోని వస్తువులన్నింటినీ ధ్వంసం చేసి, విలువైన వస్తువులను దోచుకెళ్లడంతో పాటు పెట్రోల్ బాంబులతో ఇంటిని దగ్ధం చేశారని చెప్పారు. సమాచారం తెలుసుకున్న సర్పంచ్, గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారని తెలిపారు. అప్పటికే సిద్ధం చేసుకున్న రాళ్లు, కర్రలతో టీడీపీ వర్గీయులు దాడులకు తెగబడ్డారన్నారు. – రామిరెడ్డిపల్లి పోలింగ్ బూత్ వద్ద టీడీపీ వర్గీయులు ఎలా దాడులకు తెగబడిందీ బాధితులు వివరించారు. ఇప్పటికీ టీడీపీ నాయకుల బెదిరింపులు ఆగడం లేదని, రామిరెడ్డిపల్లిలో ఎవరినీ వదలమని.. చంపేస్తామంటూ బెదిరించారని.. మీరే రక్షణ కల్పించాలని మొరపెట్టుకున్నారు. టీడీపీ గుండాల బెదిరింపులకు గ్రామంలో పది కుటుంబాలు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లి పోయాయని సిట్ అధికారుల దృష్టికి తెచ్చారు. – అనంతపురం జిల్లా తాడిపత్రిలోని విధ్వంసకాండపై సిట్ ఇన్చార్జ్ అదనపు డీజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో అధికారుల బృందానికి బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి సతీమణి కేతిరెడ్డి రమాదేవి, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ సభ్యులు సిట్ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. దాడులు అరికట్టడంలో పోలీసుల వైఫల్యం, బాధితులపై తిరిగి పోలీసులు దౌర్జన్యానికి దిగడం, ఆస్తులు ధ్వంసం చేయడంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటో ఆధారాలను సమర్పించారు.– పల్నాడు జిల్లాలోని నరసారావుపేట, మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో టీడీపీ హింసాకాండపై బాధితులు సిట్ అధికారుల వద్ద తమ ఆవేదన వెళ్లగక్కారు. మంత్రి అంబటి రాంబాబు సిట్ అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల రోజున పలు గ్రామాల్లో వైఎస్సార్సీపీ ఏజెంట్లపై టీడీపీ వర్గీయుల దాడి, రూరల్ సీఐ రాంబాబు వ్యవహరించిన తీరుపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు.– పల్నాడు జిల్లా కారెంపూడిలో ఈ నెల 14న ఉదయం నుంచి రాత్రి వరకు టీడీపీ గుండాలు సాగించిన దౌర్జన్యకాండను బాధితులు సిట్ అధికారులకు వివరించి కన్నీటి పర్యంతమయ్యారు. జిల్లాలోని దాచేపల్లి నగర పంచాయతీలో ఇరికేపల్లి, కేసానుపల్లి, తంగెడ, మాదినపాడు, దాచేపల్లిలో టీడీపీ రౌడీ మూకలు తెగబడి బీభత్సం సృష్టించిన తీరును బాధితులు వివరించారు. -
రేవంత్ ఇంటి దగ్గర్లోనూ ఓ వార్‌రూమ్!
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబీకులు, అనుచరులపై నిఘా ఉంచడానికి ఓ గెస్ట్‌హౌస్ తీసుకున్నట్టు తెలిసింది. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసానికి సమీపంలో ఉన్న దీంట్లో ప్రణీత్‌రావు వార్‌రూమ్ నిర్వహించాడు. ఈ గెస్ట్‌హౌస్ కేంద్రంగానే భారీ సెటిల్మెంట్లు కూడా జరిగినట్టు తెలిసింది. పోలీసు కస్టడీలో ఉన్న హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు విచారణలో ఈ విషయాలు గుర్తించిన అధికా రులు ఆదివారం రాత్రి ఆ గెస్ట్‌హౌస్‌లో సోదాలు చేశారు. మరోపక్క రాధాకిషన్‌రావు కస్టడీ బుధవారంతో ముగి యనుండటంతో సిట్ అధికారులు తమ దర్యా ప్తు, విచారణ ముమ్మరం చేశారు. నిఘా అధికారులు చేసిన ఫోన్ ట్యాపింగ్ కారణంగానే 2015 నాటి ‘ఓటుకు కోట్లు’వ్యవహారం, 2022లో చోటు చేసుకున్న ‘ఎమ్మెల్యేలకు ఎర’అంశం వెలుగులోకి వచ్చాయి. ప్రభాకర్‌రావు ఎస్ఐబీ చీఫ్‌గా మారిన తర్వాత ట్యాపింగ్ దుర్వినియోగం కావడం మొదలైంది. తొలినాళ్లలో ఈ విభాగం నిబంధనల ప్రకారమే అవసరమైన ఫోన్‌నంబర్లను లీగల్ ఇంటర్సెప్షన్గా (ఎల్ఐ) పిలిచే చట్టబద్ధమైన విధానం ద్వారానే ట్యాప్ చేసింది. అయితే 2018 ఎన్నికల నుంచి వీరి ట్యాపింగ్ పంథా మారిపోయింది. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఫోన్లతోపాటు సోషల్‌మీడియాను ట్యాప్ చేయాలని భావించారు. ప్రణీత్‌రావు, తిరుపతన్న, వేణుగోపాల్‌రావు తదితరులను ఎస్ఐబీలోకి తీసుకున్న తర్వాత, భుజంగరావు పొలిటికల్ ఇంటెలిజెన్స్ బాధ్యతలు చేపట్టడంతో ప్రభాకర్‌రావు ట్యాపింగ్‌ను కొత్త పుంతలు తొక్కించారు. దీనికోసం విదేశాల నుంచి ఉపకరణాలు, సాఫ్ట్వేర్స్ అక్రమంగా దిగుమతి అయ్యాయి. టెక్నాలజీ కన్సల్టెంట్ రవిపాల్ అలియాస్ పాల్ రవికుమార్ సహకారంతో ఇజ్రాయెల్ నుంచి సాఫ్ట్వేర్స్, ఎంసీ క్యాచర్స్ సమీకరించుకున్నారు. సూట్‌కేస్‌లో ఇమిడిపోయి ఉండే ఈ ట్యాపింగ్ పరికరం మ్యాన్ ఇన్ ది మిడిల్ (ఎంఐటీఎం) ఎటాక్స్‌కు వినియోగించారు. దీన్ని ప్రణీత్‌రావు టీమ్ ఓ వాహనంలో పెట్టుకొని టార్గెట్ చేసిన వ్యక్తి ఇల్లు, కార్యాలయ సమీపంలో మాటు వేసేది. ఈ పరికరానికి ఓ కృత్రిమ సెల్‌ఫోన్ టవర్గా మారిపోయి 300 మీటర్ల పరిధిలో పనిచేస్తున్న ప్రతి ఫోన్ ద్వారా జరిగే కమ్యూనికేషన్ తెలుసుకునే సామర్థ్యం ఉంది. వాటిలో తమకు కావాల్సిన దాన్ని ఎంచుకొని, దానికి సంబంధించిన సోషల్‌మీడియా సహా ప్రతి కమ్యూనికేషన్‌ను ట్యాప్ చేసే అవకాశం దానిని ఆపరేట్ చేసే వ్యక్తికి ఉంటుంది. ఇలాంటి ఓ ఉపకరణాన్నే ప్రణీత్‌రావు బృందం రేవంత్‌రెడ్డి ఇంటికి సమీపంలో తీసుకున్న గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసింది. అక్కడ నుంచే రేవంత్‌తోపాటు ఆయన కుటుంబీకులు, ప్రధాన అనుచరుల ఫోన్లపై నిఘా ఉంచింది. రాధాకిషన్‌రావు, భుజంగరావులు ఇదే గెస్ట్‌హౌస్ కేంద్రంగా కొన్ని సెటిల్మెంట్లు కూడా చేశారని తెలుస్తోంది. ఈ వ్యవహారాలను ప్రభాకర్‌రావు నేరుగా పర్యవేక్షించి భారీ వసూళ్లకు తెర లేపినట్టు పోలీసులు గుర్తించారు. -
ట్యాపింగ్ ద్వారానే ‘ఎమ్మెల్యేలకు ఎర’ వెలుగులోకి!
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీ అధీనంలోని స్పెషల్ ఆపరేషన్ టీమ్ చేసిన ఫోన్ ట్యాపింగ్ ద్వారానే బీజేపీ అగ్రనేత బీఎల్.సంతోష్ సహా పలువురు ప్రముఖులు నిందితులుగా ఉన్న ‘ఎమ్మెల్యేలకు ఎర’వ్యవహారం వెలుగులోకి వచ్చినట్టు తేలింది. నందకుమార్, రామచంద్రభారతి, సింహయాజిస్వామి ట్రాప్ కావడం, పట్టుబడటంలో అప్పట్లో హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా (ఓఎస్డీ) పనిచేసిన పి.రాధాకిషన్‌రావుతోపాటు సైబరాబాద్‌కు చెందిన మరో అధికారి కీలకంగా వ్యవహరించినట్టు సిట్ గుర్తించింది. రాధాకిషన్‌ను వారంరోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించడంతో గురువారం వైద్య పరీక్షల అనంతరం బంజారాహిల్స్ ఠాణాకు తరలించారు. ఈయన నుంచి కేసుకు సంబంధించి కీలక సమాచారం సేకరించాల్సి ఉందని పశ్చిమ మండల డీసీపీ విజయ్‌కుమార్ ప్రకటించారు. భారీ స్కెచ్...: 2022లో మునుగోడు ఉపఎన్నిక సమీపిస్తున్న వేళ.. మెయినాబాద్‌లోని అజీజ్‌నగర్‌లో అప్పటి తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో తిరుపతికి చెందిన సింహయాజిస్వామి, ఫరీదాబాద్‌లోని ఓ దేవాలయంలో ఉండే ఢిల్లీకి చెందిన సతీష్‌శర్మ అలియాస్ రామచంద్రభారతి, నగరవ్యాపారి నందకుమార్ సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) పోలీసులకు చిక్కారు. వీరు అప్పటి అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో బేరసారాలు చేస్తున్నట్టు మొయినాబాద్ ఠాణాలో కేసు నమోదైంది. బీజేపీ ఎర వేసినట్టు ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యేల్లో పైలెట్ రోహిత్‌రెడ్డితో పాటు హర్షవర్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతరావు ఉన్నారు. అప్పటి ఎస్ఐబీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు ఈ నలుగురు ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేసినట్టు వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే ఎర అంశం వెలుగులోకి రావడంతో ఆయన ప్రభాకర్‌రావును అప్రమత్తం చేశారు. అప్పటి సర్కారుకు సమాచారం ఇచ్చిన ప్రభాకర్‌రావు టాస్క్‌ఫోర్స్‌కు ఓఎస్డీగా ఉన్న రాధాకిషన్‌రావుతో కలిసి భారీ స్కెచ్ వేశారు. సైబరాబాద్ అధికారులతో కలిసి అమలు... వీరు వేసుకున్న పథకం ప్రకారం బీజేపీ తరఫున వస్తున్న సింహయాజిస్వామి, సతీష్ శర్మ, నందకుమార్‌లను ట్రాప్ చేయడానికి హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌తో పాటు సైబరాబాద్ ఎస్ఓటీ, ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. నందకుమార్ ఫోన్‌ను కూడా కొన్నాళ్లు ట్యాప్ చేయడం ద్వారా మరికొంత సమాచారం సేకరించారు. రాధాకిషన్‌రావు సహా మరికొందరు అధికారులు ట్రాప్ జరగడానికి ముందు రోజు (2022 అక్టోబర్ 25) ఫామ్‌హౌస్‌ను సందర్శించారు. అక్కడ అవసరమైన ప్రాంతాల్లో రహస్యంగా సీసీ కెమెరాలు, వాయిస్ రికార్డర్లు, మైక్‌లు.. ఇలా మొత్తం 75 సాంకేతిక ఉపకరణాలు అమర్చారు. ఈ వ్యవహారంలో రాధాకిషన్‌రావుతో పాటు సైబరాబాద్‌లో ఇన్స్పెక్టర్గా పనిచేసిన అధికారి కీలకంగా వ్యవహరించినట్టు తేలింది. 2022 అక్టోబర్ 26 రాత్రి ఫామ్‌హౌస్ సమీపంలో వలపన్ని ఉన్న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, సైబరాబాద్ ఎస్ఓటీ, రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు నలుగురు ఎమ్మెల్యేలతో బేరసారాలు చేస్తున్న ముగ్గురినీ పట్టుకున్నారు. ఈ ఎపిసోడ్ మొత్తం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు సంబంధించినది అయినా.. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు రాధాకిషన్‌రావు రంగంలోకి దిగారని తెలుస్తోంది. కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉండటంతో... ఎమ్మెల్యేల ఎర కేసును తొలుత మొయినాబాద్ పోలీసులే దర్యాప్తు చేశారు. అయితే లోతైన దర్యాప్తునకు నాటి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది. దీని దర్యాప్తు తుది దశకు చేరిన తర్వాత సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. దీన్ని విచారించిన న్యాయస్థానం ఆ మేరకు ఆదేశాలు ఇచ్చింది. అయితే సీబీఐ దర్యాప్తు అవసరం లేదని, తాము ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు పూర్తి చేస్తోందంటూ హైకోర్టు ఆదేశాలను నాటి ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ప్రస్తుతం ఈ పిటిషన్ అక్కడే పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలోనే తాజా కేసులో భాగంగా నాటి ‘ఎర కేసు’లోని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలా? వద్దా? అనే అంశంపై పోలీసులు న్యాయనిపుణుల సలహా తీసుకోనున్నారు. రాధాకిషన్‌రావును పోలీసు కస్టడీలోకి తీసుకున్న నేపథ్యంలో పశ్చిమ మండల డీసీపీ విజయ్‌కుమార్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో ‘ఎస్ఐబీలో అనధికారికంగా, రహస్యంగా, చట్ట విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైల్‌లను అభివృద్ధి చేయడంలో రాధాకిషన్‌రావు కీలకపాత్ర పోషించారు. కొంతమంది వ్యక్తుల ఆదేశానుసారం వాటిని రాజకీయపార్టీకి అనుకూలంగా, పక్షపాత ధోరణిలో ఉపయోగించుకోవడంలో మరికొందరితో కలిసి పన్నిన కుట్రలో భాగస్వాముడయ్యారు. ఆ నేరాలకు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేయడానికి కుట్ర పన్నారు. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న రాధాకిషన్‌రావు నుంచి కీలక సమాచారం సేకరించే కోణంలో దర్యాప్తు అధికారి, ఆయన బృందం ప్రశ్నిస్తోంది. ఈ కేసు దర్యాప్తు పురోగతిలో ఉంది’అని పేర్కొన్నారు. -
ముక్కలు చేసి.. మూసీలో పడేసి!
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీలోని స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) ద్వారా జరిగిన అక్రమ ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టు అయిన అదనపు ఎస్పీల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్నలను ఐదు రోజులపాటు పోలీసు కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. ఫలితంగా ట్యాపింగ్‌తో పాటు ఆధారాల ధ్వంసానికి సంబంధించిన సమాచారం సేకరించారు. ఈ వివరాలను పోలీసులు తమ రిమాండ్ రిపోర్టు ద్వారా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. భుజంగరావు, తిరుపతన్నలు తమ నేరం అంగీకరించారని, ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు ఆదేశాలతోనే నేరం చేసినట్టు బయటపెట్టారని కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. మంగళవారం వీరిద్దరిని గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి శనివారం వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించగా, చంచల్‌గూడ జైలుకు తరలించారు. ప్రణీత్‌రావు దారికి వచ్చాడంటూ... ఈ కేసులో తొలి అరెస్టు ఎస్ఐబీ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావుదే. తొలుత పోలీసు విచారణకు అతడు సహకరించలేదని, అయితే రానురాను సహకరిస్తూ కీలక వివరాలు వెల్లడించారని పోలీసులు కోర్టుకు తెలిపారు. ప్రభాకర్‌రావు రాజీనామా చేసిన రోజే (గత ఏడాది డిసెంబర్ 4న) ఆయన ఆదేశాల మేరకు ప్రణీత్‌రావు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న టీఎస్ఎస్పీ హెడ్‌కానిస్టేబుల్ కైతోజు కృష్ణతో కలిసి ఎస్ఐబీ కార్యాలయంలోకి వెళ్లారు. అక్కడ తాను ఏర్పాటు చేసుకున్న వార్ రూమ్‌తోపాటు అధికారిక ట్యాపింగ్స్ జరిగే లాగర్ రూమ్ దగ్గర సీసీ కెమెరాలు ఆఫ్ చేయించాడు. వార్‌రూమ్‌లోని 17 కంప్యూటర్లలో ఉన్న వాటితోపాటు విడిగా భద్రపరిచిన 50 హార్డ్‌డిస్క్ లను ధ్వంసం చేయడానికి ఉపక్రమించాడు. తనతో వచ్చిన ఎల్రక్టీషియన్తోపాటు నమ్మినబంటుగా ఉన్న ఓ పోలీసు సహాయంతో ఎలక్ట్రిక్ కట్టర్ వినియోగించి ఈ హార్డ్‌డిస్క్‌లు ముక్కలు చేశాడు. వీటి శకలాలను నాగోలు వద్ద మూసీనదిలో పారేశాడు. ఈ విషయాలు వెలుగులోకి రావడంతోనే అప్రమత్తమైన సిట్ అధికారులు మూసీలో సోదాలు చేశారు. వీరికి ధ్వంసమైన హార్డ్‌డిస్క్ కేసులు 5, హార్డ్‌డిస్క్ ముక్కలు తొమ్మిది లభించాయి. వీటితో పాటు తాము మూసీ నుంచే ఆరు మెటల్ హార్డ్‌డిస్క్ ముక్కల్నీ సీజ్ చేశామని కోర్టుకు తెలిపారు. ఎస్ఐబీ కార్యాలయం నుంచి ఆధారాలు ప్రణీత్‌రావు వాంగ్మూలం ఆధారంగా సిట్ అధికారులు మూసీనది నుంచే కాకుండా గ్రీన్‌లాండ్స్‌లోని ఎస్ఐబీ కార్యాలయం, దాని ఆవరణ, పరిసరాల నుంచి కొన్ని ఆధారాలు, భౌతిక సాక్ష్యాలు సేకరించారు. అక్రమ ట్యాపింగ్‌కు వినియోగించిన 12 కంప్యూటర్లు, 7 సీపీయూలు, ల్యాప్‌టాప్, మానిటర్లు, పవర్ కేబుళ్లు స్వాదీనం చేసుకున్నారు. అక్కడ ఉన్న ఎలక్ట్రిషియన్ గదిలో క్లూస్, ఫోరెన్సిక్ అధికారులతో కలిసి సోదాలు చేసిన సిట్ హార్డ్‌డిస్క్‌లు కట్ చేస్తున్నప్పుడు కింద పడి, మూలలకు చేరిన వాటి పొడిని సీజ్ చేశారు. ఎస్ఐబీ కార్యాలయ ఆవరణలో పాక్షికంగా కాలిన డాక్యుమెంట్లు, స్పైరల్ బైండింగ్ చేసిన పత్రాలతో పాటు సీసీ కెమెరాల ఫుటేజీకి సంబంధించిన లాగ్‌బుక్ ప్రతులను పోలీసులు సేకరించారు. ఎస్ఐబీ కానిస్టేబుల్ కొత్త నరేష్ గౌడ్ నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. టి.ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ప్రతిపక్షాలపై తాము నిఘా పెట్టినట్టు అతడు బయటపెట్టాడు. ప్రధానంగా ప్రైవేట్ వ్యక్తులపై అక్రమ నిఘా ఉంచడంలో భుజంగరావు, తిరుపతన్న కీలకంగా వ్యవహరించారని, ఈ విషయాన్ని వారు అంగీకరించారని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. -
ట్యాపింగ్ కేసులో రిమాండ్ రిపోర్టు.. అది ‘కారు’చిచ్చే!
సాక్షి, హైదరాబాద్: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన అక్రమ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇటీవల అరెస్టైన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు దీనితోపాటు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. రిపోర్టులోని వివరాల మేరకు.. ‘‘రాష్ట్ర అవతరణ తర్వాత బీఆర్ఎస్ నాయకత్వం కుల సమీకరణాల్లో భాగంగానే డీఐజీ హోదాలో ఉన్న టి.ప్రభాకర్‌రావును 2016లో ఎస్ఐబీ చీఫ్‌గా నియమించింది. తమ కులంతోపాటు ఇతర కులాలకు చెందిన నమ్మకస్తులైన అధికారులను నేతలు ఎంపిక చేసున్నారు. వివిధ విభాగాలు, జిల్లాల్లో పనిచేస్తున్న వీరందరినీ ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ విభాగంలోకి డిప్యూటేషన్‌పై తెచ్చుకున్నారు. అందులో నల్లగొండ నుంచి ప్రణీత్‌రావు, రాచకొండ నుంచి భుజంగరావు, సైబరాబాద్ నుంచి వేణుగోపాల్‌రావు, హైదరాబాద్ నుంచి తిరుపతన్న ఉన్నారు. ప్రభాకర్‌రావు సూచనల మేరకే 2017లో రాధాకిషన్‌రావును బీఆర్ఎస్ నాయకత్వం హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియమించింది. దీని వెనుక రాజకీయ, ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ప్రభాకర్‌రావు, రాధాకిషన్ రావు, ప్రణీత్‌రావు, భుజంగరావు తరచుగా కలు స్తూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కొనసాగడం కోసం చేయాల్సిన పనులపై చర్చించేవారు. గుట్టుగా సంప్రదింపులు జరుపుతూ.. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్‌లో వెస్ట్‌జోన్‌కు 2021 వరకు ఇన్స్పెక్టర్గా పనిచేసిన గట్టుమల్లును రాధాకిషన్‌రావు సూచనల మేరకు ప్రభాకర్‌రావు ఎస్ఐబీలోకి తీసుకున్నారు. తమ లక్ష్యాలను చేరుకోవడానికి చేసే కుట్రలను అమలు చేయడానికి గట్టుమల్లును వినియోగించుకున్నారు. ఇంటెలిజెన్స్, టాస్క్ఫోర్స్ల్లోని మానవ వనరులతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి.. వీరి అక్రమాలు ఎవరికీ తెలియకుండా ఉండేలా ప్రభాకర్‌రావు బృందం అనేక జాగ్రత్తలు తీసుకుంది. వారంతా కేవలం వాట్సాప్, సిగ్నల్, స్నాప్‌చాట్ వంటి సోషల్ మీడియా యాప్స్ ద్వారానే సంప్రదింపులు జరిపేవారు. ఎస్ఐబీ చీఫ్‌గా ఉన్న ప్రభాకర్‌రావు తన నమ్మినబంటు ప్రణీత్‌రావును స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్ఓటీ) నిర్వహణ కోసమే తీసుకువచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేయడం, ప్రతిపక్షాలను ముప్పతిప్పలు పెట్టడానికి నేతలతోపాటు వారి అనుచరులనూ టార్గెట్ చేయడం, అక్రమ నిఘాతో సున్నిత సమాచారం సేకరించి అవకాశమున్న ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్లో చేరేలా చేయడం వంటివే వారి టార్గెట్. నగదు రవాణాను గుర్తించి.. ప్రభాకర్‌రావు, ఆయన బృందం ప్రధానంగా ప్రతిపక్షాలకు చెందిన నగదు రవాణాపై దృష్టి పెట్టింది. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున భవ్య సిమెంట్ కంపెనీకి చెందిన ఆనంద్ ప్రసాద్ పోటీచేశారు. ఆ సమయంలో ఎస్ఐబీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు రంగంలోకి దిగి.. ఆనంద్ ప్రసాద్ సంబందీకుల నగదు రవాణాపై నిఘాపెట్టారు. ఆ వివరాలను టాస్క్‌ఫోర్స్ డీసీపీగా ఉన్న రాధాకిషన్‌రావుకు అందించారు. ఈయన ఆదేశాలతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.. రాంగోపాల్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలోని ప్యారడైజ్ వద్ద రూ.70 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 2020లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో ప్రణీత్‌రావు.. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు సంబందీకులపై నిఘా పెట్టి వివరాలను రాధాకిషన్‌రావుకు చేరవేశారు. ఫలితంగానే సిద్దిపేటలో చిట్‌ఫండ్ కంపెనీ నిర్వహించే రఘునందన్‌రావు బంధువు నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు రూ.కోటి స్వాధీనం చేసుకున్నారు. 2022 అక్టోబర్ రెండోవారంలో మునుగోడు ఉప ఎన్నిక జరిగింది. అప్పట్లో ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంబంధీకులపై ప్రణీత్‌రావు సాంకేతిక నిఘా ఉంచారు. నగదు రవాణా అంశాన్ని గుర్తించి రాధాకిషన్‌రావుకు తెలిపారు. ఈయన ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ టి.శ్రీనాథ్‌రెడ్డి నేతృత్వంలోని బృందం తనిఖీలు చేసి.. కోమటిరెడ్డి అనుచరులైన జి.సాయికుమార్‌రెడ్డి, ఎం.మహేందర్, ఎ.అనూ‹Ùరెడ్డి, వి.భరత్‌ల నుంచి రూ.3.5 కోట్లు స్వా«దీనం చేసుకుంది’’ అని సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. రాధాకిషన్‌రావు నుంచి మరిన్ని కీలక విషయాలు రాబట్టడం కోసం తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది. ప్రతిపక్షాలతోపాటు విమర్శించే వారిపైనా.. ప్రతిపక్షాలపై నిఘా ఉంచడం, అడ్డుకోవడం ద్వారా 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ను మూడోసారి గెలిపించడమే తమ లక్ష్యమంటూ ప్రభాకర్‌రావు తన బృందమైన రాధాకిషన్‌రావు, ప్రణీత్‌రావు, భుజంగరావు, వేణుగోపాల్‌రావు, తిరుపతన్నలకు స్పష్టంచేశారు. ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబీకులు, సంబం«దీకులు, మద్దతిచ్చే వ్యాపారులతోపాటు బీఆర్ఎస్ను విమర్శించే వారిపైనా ప్రభాకర్‌రావు బృందం నిఘా ఉంచింది. బీఆర్ఎస్ నాయకత్వం ఆదేశాల మేరకు.. ఆ పార్టీ నాయకులు కొందరిపైనా నిఘా వేశారు. రాధాకిషన్‌రావు 2020 ఆగస్టులోనే పదవీ విరమణ చేసినా.. కుల ప్రాతిపదికన ఆయనకు ఓఎస్డీగా రెండుసార్లు అవకాశమిచ్చారు. హైదరాబాద్ నగరంపై పట్టు కొనసాగడానికే ఇలా చేశారు. -
అన్ని వేళ్లూ అటు వైపే!
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు ‘సైన్యానికి’, నల్లగొండ జిల్లాకు లింకు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వాళ్లు గతంలో ఆ ఉమ్మడి జిల్లాలో పని చేసిన వాళ్లే కావడం గమనార్హం. పోలీసు కస్టడీలో ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును సిట్ అధికారులు మూడో రోజైన మంగళవారమూ బంజారాహిల్స్ ఠాణాలో ప్రశ్నించారు. మరోపక్క ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఇద్దరు ఇన్స్పెక్టర్లను సిట్ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ప్రభాకర్‌రావు 2014కు ముందు ప్రాధాన్యత కలిగిన పోస్టింగ్స్ చాలా తక్కువ చేశారు. అలాంటి వాటిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎస్పీ కూడా ఒకటి. ప్రభాకర్‌రావుకు ప్రణీత్ అక్కడే పరిచయమైనట్లు తెలిసింది. అతడితోపాటు ఎస్ఐబీ కేంద్రంగా ప్రభాకర్‌రావుకు, కొందరు రాజకీయ నాయకులకు ప్రైవేట్ సైన్యంలా పని చేసిన అనేక మంది అధికారులు ఆయన హయాంలో నల్లగొండ జిల్లాలో పని చేసిన వాళ్లే అని పోలీసులు చెబుతున్నారు. అలా తనకు నమ్మకస్తులుగా మారిన కొందరిని ప్రభాకర్‌రావు ఎస్ఐబీ చీఫ్‌గా మారిన తర్వాత ఆ విభాగంలోకి తెచ్చుకున్నారు. వీళ్లందరూ అక్రమ ట్యాపింగ్‌లో కీలక పాత్ర పోషించారని సమాచారం. ఇలాంటి అధికారుల్లో ఇద్దరు ఇన్స్పెక్టర్లు ప్రస్తుతం వరంగల్ పరిధిలో పని చేస్తున్నారు. విదేశాల నుంచి సాఫ్ట్వేర్లు... ప్రభాకర్‌రావుతోపాటు ఓ కీలక రాజకీయ నేత ఆదేశాల మేరకు ప్రణీత్‌రావు అండ్ టీమ్ సర్వీస్ ప్రొవైడర్లతో సంబంధం లేకుండానే అక్రమంగా ట్యాపింగ్ చేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్వేర్లను విదేశాల నుంచి ఖరీదు చేసి ఉంటారని భావిస్తున్నారు. ఎస్ఐబీ కార్యాలయంలో ప్రణీత్ ఏర్పాటు చేసుకున్న 17 కంప్యూటర్లలో ఈ సాఫ్ట్వేర్లు ఉండొచ్చని, ఆ విషయం బయటకు రాకూడదని సంబంధిత హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేసి నగర శివార్లలోని అటవీ ప్రాంతంలో పారేసినట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రణీత్‌కు ఇన్ఫార్మర్గా పని చేసి, అతడితో కలిసి బెదిరింపు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మీడియా సంస్థ యజమాని ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రణీత్ ఎస్ఐబీ కార్యాలయంలోపాటు సదరు మీడియా సంస్థ ఆఫీస్, వరంగల్, సిరిసిల్లలోనూ కొన్ని కంప్యూటర్లు, సర్వర్లు ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ కీలక రాజకీయ నాయకుడి ఆదేశాల మేరకు మరో నేత సహకారంతో ఇవి ఏర్పాటు చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇవి ఆయా ప్రాంతాల్లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అక్కడ ఉంచి ఏం చేశారు? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
చార్మినార్-ఫలక్‌నుమా మధ్య చక్కర్లు!
సాక్షి, హైదరాబాద్: కాలిఫట్ స్థాపనే ధ్యేయమంటూ ఆన్లైన్ ద్వారా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు ఆకర్షితుడైన పాతబస్తీ వాసి మహ్మద్ అబుసాని కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు ప్రారంభించింది. గత నెలలో ఇతడిపై కేసు నమోదు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. దీనిని రీ–రిజిస్టర్ చేసిన సీసీఎస్ పోలీసులు దర్యాప్తు నిమిత్తం సిట్‌కు బదిలీ చేశారు. ఈ కేసులో కీలకాంశాలు గుర్తించడం కోసం నిందితుడిని కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు సోమ, మంగళవారాలు విచారించారు. అబుసాని బైక్‌పై చార్మినార్–ఫలక్‌నుమా మధ్య ప్రాంతాల్లో పలుమార్లు సంచరించినట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఇందుకు గల కారణాలను అబుసాని నుంచి రాబట్టారు. విదేశంలో ఉన్న హ్యాండ్లర్ ఇతగాడికి సోషల్‌మీడియా ద్వారా కొన్ని లింకులు పంపించాడు. వాటిలో స్థానికంగా లభించే దీపావళి టపాసుల మందు, హైడ్రోజన్ పెరాక్సైడ్ తదితరాలు వాడి బాంబులు తయారు చేయడం ఎలా? అనే వివరాలు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వీటి కోసమే అబుసాని ఆయా ప్రాంతాల్లో సంచరించాడని వెలుగులోకి వచ్చింది. మరికొందరిని ఉగ్రవాద బాట పట్టించడంతో పాటు నిధుల సమీకరణకు ఇతడు ప్రయత్నాలు చేశాడని చెప్తున్నారు. హ్యాండ్లర్ సహా ఇతర ప్రాంతాల్లోని స్లీపర్ సెల్స్‌తో సంప్రదింపుల జరపడానికి ఇతను ఫేస్‌బుక్‌తో పాటు 27 ఇన్‌స్ట్ర్రాగామ్ ఐడీలు, రెండు టెలిగ్రామ్ ఐడీలు వాడినట్లు పోలీసులు గుర్తించారు. ఆయా సోషల్‌మీడియా గ్రూపుల్లో ఉబ్జెకిస్థాన్తో పాటు పాకిస్థాన్‌కు చెందిన అనేక మంది సభ్యులుగా ఉన్నట్లు తేలింది. అమెరికా, ఇజ్రాయిల్‌కు సంబంధించిన ఎంబసీలను టార్గెట్ చేయాలని, బాంబు పేలుళ్లకు పాల్పడటం ద్వారా భయోత్పాతం సృష్టించాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వీడియోలు ఉన్నాయని సమాచారం. హైదరాబాద్ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎంబసీల వద్ద రెక్కీ చేసి, అనువైన దాన్ని గుర్తించాలని ఆన్లైన్ ద్వారా హ్యాండ్లర్ ఆదేశించాడు. ఓ పక్క అబుసాని ఈ ప్రయత్నాల్లో ఉండగానే హ్యాండ్లర్ నిర్వహిస్తున్న టెలిగ్రామ్ గ్రూపులో ఇటీవల మరో సందేశం వచ్చింది. అమెరికాలోని వాషింగ్టన్ డీసీ నేషనల్ క్యాపిటల్ బ్యాంక్ వద్ద పేలుడుకు సిద్ధం కావాలంటూ అందులో సూచించాడు. దీనికి తాను సిద్ధమంటూ అబుసాని అదే గ్రూపులో పోస్టు చేశాడు. బాంబుల తయారీని సూచించే లింకుల్ని ఓపెన్ చేసినట్లు పోలీసులు చెప్తున్నా ప్రయోగాలు చేశాడా? లేదా? అనే తేలాల్సి ఉందన్నారు. అబుసాని ఫోన్‌ను విశ్లేషించడం కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఈ వార్త కూడా చదవండి: కడుపులో 11.57కోట్ల కొకైన్.. -
‘సిట్’ అస్త్రసన్యాసం
సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో దర్యాప్తును ప్రభుత్వం వ్యూహాత్మకంగా అటకెక్కించేసింది. సంచలనం సృష్టించిన ఈ హత్యాయత్నం కేసులో విచారణను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దాదాపుగా చాప చుట్టేసినట్టే కనిపిస్తోంది. కొన్ని రోజులుగా విచారణ ప్రక్రియ ముందుకు సాగకపోవడం వెనుక ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉన్నట్లు స్పష్టమవుతోంది. హత్యాయత్నంగా నమోదు చేసిన ఈ కేసులో సిట్ ఉద్దేశ్యపూర్వకంగానే కుట్ర కోణాన్ని విస్మరించింది. మొదట్లో కొంత హడావుడిగా కనిపించిన సిట్ అధికారులు ఇటీవల సీఎం చంద్రబాబు విశాఖపట్నం విమానాశ్రయంలో చేసిన ‘కర్తవ్యబోధ’తో అస్త్రసన్యాసం చేశారు. కేసు దర్యాప్తును మమ అనిపించే దిశగా విచారణ తంతును సాగదీస్తున్నారు. తెరవెనుక పెద్దలను ఎందుకు గుర్తించడం లేదు? ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం కేసు దర్యాప్తును కేవలం నిందితుడు శ్రీనివాసరావుకే పరిమితం చేయాలన్న ప్రభుత్వ పెద్దల మార్గదర్శకత్వంలోనే సిట్ నడుచుకుంటోంది. హత్యాయత్నం జరిగి రెండు వారాల తరువాత కూడా శ్రీనివాసరావును తప్ప మరో నిందితుడిని గుర్తించకపోవడమే ఇందుకు నిదర్శనం. కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయంలో పక్కాగా హత్యాయత్నానికి పాల్పడటం శ్రీనివాసరావు ఒక్కడి వల్ల సాధ్యం కాదన్నది అందరికీ తెలిసిందే. పోలీసులు మాత్రం శ్రీనివాసరావును తప్ప తెరవెనుక ఉన్న అసలు కుట్రదారులను ఎందుకు గుర్తించలేకపోతున్నారన్నది సందేహాస్పదంగా మారింది. టీడీపీ నేత, ఎయిర్పోర్ట్ రెస్టారెంట్ యజమాని హర్షవర్థన్ ప్రసాద్ చౌదరి నిందితుడు శ్రీనివాసరావుకు ఉద్యోగం, ఆశ్రయం ఇచ్చారు. హర్షవర్థన్ ప్రసాద్ చౌదరిని కూడా నిందితుడిగా చేర్చి పూర్తిస్థాయిలో విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ, సిట్ అధికారులు మాత్రం ఆ దిశగా ఎలాంటి ముందుకు కదలడం లేదు. హర్షవర్థన్ ప్రసాద్ చౌదరిని ఒకసారి పిలిచి తూతూమంత్రంగా విచారించి విడిచిపెట్టారు. అంతేకాదు శ్రీనివాసరావుకు సహాయ సహకారాలు అందించిన ఇతర వ్యక్తులను గుర్తించడంపై సిట్ దృష్టి పెట్టడం లేదు. అతడిని హర్షవర్థన్ చౌదరి వద్దకు తీసుకొచ్చింది ఎవరు? ఆర్థిక సాయం అందించింది ఎవరు? ఆ నిధులు ఎవరి నుంచి ఎవరికి వెళ్లాయి? హర్షవర్థన్ చౌదరి కాల్‌డేటాలో ఏయే వివరాలున్నాయి? తదితర కీలక కోణాలను సిట్ అధికారులు ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నట్లు తెలుస్తోంది. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ హత్యాయత్నం కేసులో అసలు దోషులను గుర్తించలేకపోవడం సిట్ వైఫల్యమేనని స్పష్టమవుతోంది. ‘‘నిందితుడు శ్రీనివాసరావు హత్యాయత్నానికి పాల్పడి విమానాశ్రయంలో పోలీసులకు చిక్కాడు. అతడిని పట్టుకోవడంలో పోలీసుల ఘనత ఏమీ లేదు. కానీ, తెరవెనుక దాక్కున్న అసలు కుట్రదారులను కనిపెట్టలేకపోవడం మాత్రం కచ్చితంగా పోలీసుల వైఫల్యమే’’ అని ఓ రిటైర్డ్ పోలీసు అధికారి చెప్పారు. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే సిట్ అధికారులు నడుచుకుంటున్నారని, ఈ కేసులో హర్షవర్థన్ ప్రసాద్ చౌదరితోపాటు ఇతరుల ప్రమేయాన్ని బట్టబయలు చేసే దిశగా దర్యాప్తు చేయడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కుట్ర కోణాన్ని ఛేదించడంపై శ్రద్ధ ఏది? సిట్ దర్యాప్తు కొన్ని రోజులుగా పడకేసిందనే చెప్పాలి. నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు పోలీసు కస్టడీ ముగియడంతోనే ఈ కేసు దర్యాప్తులో వేగం ఒక్కసారిగా నెమ్మదించింది. ఈ కేసులో అనుమానితులను గుర్తించి, విచారించే ప్రక్రియకు మంగళం పాడేశారు. సిట్ కార్యాలయంలో కార్యకలాపాలు నిలిచిపోయాయి. అనుమానితులను విచారించిన దాఖలాలు కనిపించడం లేదు. సిట్ విచారణ ప్రక్రియ పర్యవేక్షకుడుగా ఉన్న డీసీపీ నయీం కొన్ని రోజులుగా సిట్ కార్యాలయం వైపు కన్నెత్తి చూడడం లేదు. సిట్ విచారణ అధికారి అయిన ఏసీపీ నాగేశ్వరరావు, ఇతర అధికారులు న్యాయస్థానానికి సమర్పించే సీల్డ్ కవర్ నివేదిక రూపకల్పనలోనే నిమగ్నమయ్యారు. అంతేతప్ప కేసు విచారణను వేగవంతం చేసి కొత్త కోణాలను గుర్తించడం, కుట్ర కోణాన్ని ఛేదించడంపై దృష్టి సారించడం లేదని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. నిందితుడు శ్రీనివాసరావు నేర చరిత్రను ఆరా తీసేందుకు అతడు గతంలో పనిచేసిన వివిధ రాష్ట్రాల్లోని ప్రదేశాలకు దర్యాప్తు బృందాన్ని పంపుతామని అధికారులు చెప్పారు. కానీ, ఆ దిశగా ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదని ఓ అధికారి వ్యాఖ్యానించారు. కొన్నిరోజులుగా ఈ కేసులో సిట్ అధికారులు చెప్పుకోదగ్గ పురోగతి ఏదీ సాధించలేదని ఆయన చెప్పారు. సీఎం చంద్రబాబు విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చి వెళ్లిన తర్వాతే సిట్ దర్యాప్తు నిలిచిపోవడం గమనార్హం. -
బిర్యానీ కావాలన్న శ్రీనివాస్..
సంచలనం కోసమే నిందితుడితో డ్రామా నడిపించారని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేసిన పోలీసులు..చివరకు అది హత్యాయత్నమేనని అంగీకరించక తప్పలేదు. ప్రతిపక్ష నేతకు అదృష్టవశాత్తూ ముప్పు తప్పిందని, కత్తి పోటు గొంతులో దిగి ఉంటే ప్రాణాలు దక్కేవి కావని కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. కుట్ర కోణంపై లోతైన దర్యాప్తు చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా ఆదివారం మీడియాతో చెప్పారు. ఎయిర్‌పోర్టు పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో కొన్ని పంక్తులివి.. ‘‘ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై గత గురువారం విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన కత్తి దాడి హత్యాయత్నమే. వైఎస్ జగన్ అదృష్టవశ్తాతూ యాధృచ్ఛికంగా పక్కకు తిరగడంతో ప్రాణానికి ముప్పు తప్పింది. ఆ కత్తిపోటు గొంతులో దిగి ఉంటే ప్రాణాలు దక్కేవి కావు. దుండగుడు శ్రీనివాసరావు వైఎస్ జగన్‌ను హతమార్చాలనే దాడి చేశాడు. ఎడమ చేతి భుజంపై కత్తి దింపి... వెనక్కి తీసి మరోసారి పొడిచేందుకు యత్నించగా.. పక్కనే ఉన్న వైఎస్సార్సీపీ నేతలు బలవంతంగా అతని నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు.’’ ఇంకా రిమాండ్ రిపోర్ట్‌లో విభ్రాంతికరమైన విషయాలు మరెన్నో ఉన్నాయి. కోర్టు అనుమతితో నిందితుడు శ్రీనివాసరావును ఆదివారం పోలీస్ కస్టడీకి తరలించారు. సీపీ మహేష్‌చంద్ర లడ్డా, సిట్ ఇన్చార్జి నాగేశ్వరరావులు అతనితో పాటు మొత్తం 12మందిని విచారించారు. నిందితుడు దర్యాప్తుకు పూర్తి స్థాయిలో సహకరించడం లేదని, ఏమి అడిగినా లేఖలో అంతా పేర్కొన్నాను.. చదువుకోమని చెబుతున్నాడని తెలుస్తోంది. నిందితుడి నుంచి4 సెల్ఫోన్లు స్వాధీనంచేసుకున్నారు. అతని బ్యాంకు లావాదేవీలపై సోమవారం విచారణ కొనసాగిస్తారు. సాక్షి,విశాఖపట్నం/ఎన్ఎడీ జంక్షన్: మామూలూగానే ఆ స్టేషన్లో క్రైం రేటు తక్కువ.. ఇక ఆదివారం అయితే ఆ స్టేషన్ వైపు కన్నెత్తి చూసే వారే ఉండరు. అలాంటిది ఆదివారం రోజంతా ఆ స్టేషన్లో ఒకటే హడావుడి. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా మొత్తం ఆ స్టేషన్ ఎదుటే మోహరించింది. మరోవైపు ఒకరి వెంట మరొకరుగా పోలీస్ ఉన్నతాధికారుల రాక.. పోలీసుల ఉరుకులు.. పరుగులు... విచారణ పేరుతో గంటకొకరు స్టేషన్‌కు రావడంతో ఏం జరుగుతుందోనని ఒకటే టెన్షన్. మరో వైపు ఆ స్టేషన్లో ఏం జరుగుతుందో తెలియక పరిసర ప్రాంత ప్రజలు గుమిగూడి చర్చించుకోవడం కనిపించింది. ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎయిర్‌పోర్టు వీఐపీలాంజ్‌లో జరిగిన హత్యాయత్నం కేసు విచారణ ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌లో సాగుతోంది. ఈ కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును ఆరు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించడంతో స్టేషన్ పరిసరాల్లో ఎప్పుడు లేనంత హడావుడి కనిపించింది. కేంద్ర కారాగారం నుంచి నిందితుడిని తీసుకువస్తున్న సమయంలో స్టేషన్ వద్ద పోలీసులతో పహారా కాశారు. మరో వైపు విచారణకు వేదికైన స్టేషన్‌కు అన్ని ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు చానల్స్ లైవ్ వెహికల్స్‌తో తరలి వచ్చారు. అలాగే ప్రింట్ మీడియా ప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున చేరుకోవడంతో స్టేషన్ పరిసరాలు నిండిపోయాయి. ఉదయం 11.45 గంటల సమయంలో నిందితునితో స్టేషన్‌కు పోలీస్ రక్షక్ వెహికల్ చేరుకోగా... ఫొటోలు తీసేందుకు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా కెమెరామెన్లు పోటీపడ్డారు. ఆ తర్వాత బందోబస్తు మధ్య స్టేషన్‌లోని ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన రూమ్‌లోకి తీసుకొచ్చారు. అప్పటికే స్టేషన్లో సిట్‌కు సారధ్యం వహిస్తున్న బీవీఎస్ నాగేశ్వరరావు, డీసీపీ ఫకీరప్పలున్నారు. 12 గంటలకు విచారణ ప్రారంభం కొద్ది సేపటికే విశాఖ సిటీ పోలీస్క మిషనర్ మహేష్‌చంద్ర లడ్డా సివిల్ డ్రస్‌లో స్టేషన్‌కు చేరుకోవడంతో విచారణ మొదలైంది. నిన్ననే అదుపులో తీసుకున్న నిందితుడు శ్రీనివాసరావు సహచర సిబ్బంది రమాదేవి, స్నేహితుడు రేవతిపతి, ఫ్లెక్సీ ఓనర్ చైతన్య తదితరులతో కలిసి విచారణ ప్రారంభించారు. మధ్యాహ్నం వరకు నిందితునిపై ప్రశ్నల పరంపర కొనసాగింది. అన్నింటికి ఒక్కటే మందు అన్నట్టుగా నేను చెప్పాల్సింది ఆ లేఖలోనే ఉందంటూ విచారణలో నిందితుడు పదే పదే చెప్పడంతో అధికారులు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఒకరి తర్వాత ఒకరిగా అతని స్నేహితులను కూడా స్టేషన్‌కు రప్పించి విచారణ సాగించారు. దీంతో స్టేషన్‌కు వస్తున్న వారిలో ఎవరు నిందితులో.. ఎవరు సాక్షులో తెలియక మీడియా ఒకింత అయోమయానికి గురైంది. తమ సిబ్బందిని వెంటపెట్టుకుని విచారణకు వస్తున్నఫ్యూజన్ ఫుడ్స్ అధినేత, టీడీపీ నేత హర్షవర్ధన్ బిర్యానీ కావాలన్న శ్రీనివాస్ మధ్యాహ్నం 2 గంటల వరకు విచారించిన సీపీ మహేష్ చంద్ర లడ్డా, డీసీపీ ఫకీరప్పలు భోజనానికి తమ క్యాంపు కార్యాలయాలకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏం తింటావ్ అని నిందితుడు శ్రీనివాసరావును ప్రశ్నించగా.. బిర్యాని కావాలని అడిగాడని చెబుతున్నారు. దీంతో స్టేషన్ సమీపంలో ఉన్న హోటల్ నుంచి చికెన్ బిర్యాని తీసుకురాగా దాన్ని పూర్తిగా తిన్నాడని చెబుతున్నారు. విచారణ సమయంలో ఎక్కడా బెరుకు, భయం లేకుండా అడిగిన ప్రశ్నలకు తడుం కోకుండా సమాధానాలు చెబుతుండడంతో అధికారులు కూడా ఒకింత విస్మయానికి గురయ్యారు. మధ్యాహ్నం విచారణను వేగవంతం చేశారు. ఒక్కొక్కరిగా సహచర సిబ్బందితో పాటు స్నేహితులు వస్తుండడంతో స్టేషన్ వద్ద మీడియా హడావుడి ఎక్కువగా కన్పించింది. చివరకు హోటల్ యజమాని, టీడీపీ నేత హర్షవర్ధన్‌ను కూడా విచారణకు పిలిపించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు విచారణ సాగింది. 8 గంటల సమయంలో సీపీ మహేష్‌చంద్ర బయటకొచ్చి మీడియాకు తొలిరోజు విచారణ పురోగతిని వివరించారు. హోటల్ యజమాని హర్షవర్ధన్‌తో సహా తొలి రోజు 12 మందిని విచారించారు. మూడు బ్యాంకుల్లో అకౌంట్ల లావాదేవీలపై సోమవారం విచారణ జరుపుతామని, కాల్ డేటాను పరిశీలించి అనుమానం వచ్చిన వారందర్ని పిలిపించి విచారిస్తామని సీపీ చెప్పుకొచ్చారు. దీంతో ఈ కేసులో తొలిరోజు పురోగతి పెద్దగా లేదనే చెప్పాలి. ఎందుకంటే పోలీస్ అధికారులు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు నిందితుడు నేరుగా సమాధానం చెప్పలేదని తెలియవచ్చింది. సోమవారం ఫోన్ కాల్స్, బ్యాంకు ఖాతా ల పరిశీలన జరిపితే మరిన్ని వాస్తవాలు వె లుగులోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. మీడియా సహకరించాలి ఎన్ఏడీజంక్షన్(విశాఖపశ్చిమ): సిట్ విచారణ జరుగుతోంది.. మీడియా సహకరించాలని ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ సీఐ మళ్ల శేషు కోరారు. ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు శ్రీనివాస్‌ను ఆదివారం ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్‌కు విచారణ నిమిత్తం తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో మీడియా అక్కడకు చేరింది. దీంతో ఈ ప్రాంతమంతా కోలాహలంగా మారిపోయింది. దీంతో ఎయిర్పోర్ట్ సీఐ మళ్ల శేషు మీడియాతో మాట్లాడుతూ మీరంతా ఇక్కడ ఉండడం వల్ల విచారణకు ఇబ్బంది కలుగుతోంది. కాస్త సహకరించాలని మీడి యా ప్రతినిధులను కోరారు. నవంబర్ 2 వరకు విచారణ చేపడతామని పేర్కొన్నారు. కోర్టు ఆరు రోజులు పాటు విచారణ కోసం అనుమతి ఇచ్చిందన్నారు. నిందితుడు సహకరిస్తున్నాడా అన్న ప్రశ్నకు సహకరిస్తాడని అనుకుంటున్నాను, విచారణ అధికారులు డీల్చేస్తున్నారని పేర్కొన్నారు. సిట్ అధికారుల సెల్ఫోన్ల స్విచ్ ఆఫ్ ఎన్ఏడీ జంక్షన్(విశాఖపశ్చిమ): ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణ గురించి సమాచారం బయటకు పొక్కకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నా రు. విచారణ సమయంలో మీడియాకు లీకులిస్తున్నారన్న అనుమానంతో ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఇక్కడంతా చెప్పుకుంటున్నారు. విచారణ చేపడుతున్న అధికారుల సెల్ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. వీరితో పాటు ఎస్ఐలు, కిందిస్థాయి సిబ్బంది సెల్ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్‌లోనే ఉన్నాయి. అత్యవసరమైతే బయటకు వచ్చి సెల్ ఫోన్ ఆన్ చేసి మాట్లాడుతున్నారు. ‘ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి..లీకులిస్తున్నామంటూ అధికారులు మాపై మండిపడుతున్నారు’ అని మీడియా ప్రతినిధులకు చెబుతున్నారు. విచారణకు ప్రత్యేక గది ఏర్పాటు ఎన్ఏడీ జంక్షన్(విశాఖపశ్చిమ): ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడ్ని విచారించేందుకు సిట్ అధి కారులకు ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ సమీపంలో నేర విభాగం ఏసీపీ కార్యాలయం పక్కనే ఖాళీగా ఉన్న కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. అక్కడ కంప్యూటర్, ప్రింటర్ వంటి సామగ్రిని ఏర్పాటు చేశారు. అయితే దీనికి భద్రత కొంత తక్కువగా ఉండడంతో విచారణ వరకే వినియోగించే అవకాశముంది. నిందితుడ్ని ఇక్కడే ఉంచుతారా? లేదా? అని ఇంకా నిర్ధారణకు రాలేదు. సోమవారం నుంచి విచారణ ఇక్కడే జరిగే అవకాశాలున్నాయి. -
నయీం ప్రధాన అనుచరుడి కోసం గాలింపు
హైదరాబాద్: ఇటీవల పోలీస్ ఎన్కౌంటర్లో మృతిచెందిన గ్యాంగ్‌స్టర్ నయీం కేసును సిట్ వేగవంతం చేసింది. నయీం ప్రధాన అనుచరుడిగా భావిస్తున్న శేషన్న ఆచూకీ కోసం సిట్ అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో శేషన్న మహారాష్ట్ర, కర్ణాటకలో ఉండొచ్చనే ప్రాథమిక సమాచారంతో.. ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపి గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాగా.. ఈ కేసులో ఇప్పటికే 80 మందిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం విధితమే. -
సిట్‌కు చట్టబద్ధత.. స్టేషన్ హోదా!
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులను దర్యాప్తు చేస్తున్న సిట్‌కు మరిన్ని అధికారాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. సిట్‌కు స్టేషన్ హోదా కల్పించడంతోపాటు చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించింది. దీంతో కేసులను సాధ్యమైనంత త్వరగా కొలిక్కి తీసుకురావొచ్చని భావిస్తోంది. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు వెలువరించే అవకాశం ఉంది. ప్రస్తుతం సిట్‌ను డీజీపీ అనురాగ్‌శర్మ కేసుల దర్యాప్తు కోణంలోనే ఏర్పాటు చేశారు. దీనికి చట్టబద్ధమైన అధికారాలు లేవు. కేసుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకునే అధికారం లేదు. కేసులు నమోదు చేయాలన్నా.. నిందితులను కస్టడీకి తీసుకోవాలన్నా.. సమన్లు జారీ చేయాలన్నా సంబంధిత పోలీస్‌స్టేషన్ ద్వారానే చేయాల్సి వస్తోంది. దీంతో కేసుల దర్యాప్తు అనుకున్నంత వేగంగా సాగడం లేదు. ఈ నేపథ్యంలో చట్టబద్ధత కల్పిస్తే సిట్ నేరుగా రంగంలోకి దిగే అవకాశం ఉంది. అలాగే న్యాయస్థానాల్లో కూడా ఎలాంటి ఇబ్బం దులు తలెత్తకుండా ఉంటాయి. -
నయీం కేసులో మరో 10 మంది అరెస్ట్: సిట్
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం కేసుకు సంబంధించి సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) శుక్రవారం తాజా సమాచారాన్ని విడుదల చేసింది. ఇప్పటివరకూ నయీం కేసు వ్యవహారంలో 62 కేసులను నమోదు చేశామని వెల్లడించింది. తాజాగా మరో పదిమందిని అరెస్ట్ చేశామని సిట్ పేర్కొంది. కోరుట్లలో ఒకరు, భువనగిరిలో తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపింది. నయీం గ్యాంగ్ లో కీలక వ్యక్తి ఎమ్డీ అహ్మద్ ఖాన్‌ను కోరుట్లలో అరెస్ట్ చేశారు. చిన్నబత్తిని బెంజ్‌మిన్, కాసాని ఇంద్రసేన, గుమ్మడెల్లి మల్లేష్‌ను కూడా అరెస్ట్ చేసినట్టు సిట్ అధికారులు తెలిపారు. కనుకుంట్ల శ్రీకాంత్, రావుల సురేష్, గడ్డం జంగయ్య, రాకల శ్రీనివాస్, సందెల ప్రవీణ్ కుమార్, మహ్మద్ యూనస్ లను అరెస్ట్ చేసినట్టు వెల్లడించింది. భువనగిరిలో అరెస్టైన తొమ్మిది మంది పలు నేరాల్లో భాగస్వాములగా తేల్చింది. పాశం శీనుతో కలిసి కిడ్నాప్‌లు, అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని సిట్ పేర్కొంది. -
‘సిట్’ అదుపులో బుల్లయ్య
* స్వర్ణ బార్లో మద్యం వ్యాపార పర్యవేక్షకుడు అతడే.. * కల్తీకి వాడే కెమికల్స్ ఏమిటనేది వెల్లడించని వైనం * ఇతర బార్ అండ్ రెస్టారెంట్లపైనా దృష్టిసారించిన సీపీ గౌతమ్ సవాంగ్ విజయవాడ సిటీ : కల్తీ మద్యం కేసు విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) మల్లాది శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుంది. కృష్ణలంక స్వర్ణ బార్లో పనిచేసే వ్యక్తుల సమాచారం మేరకు మద్యం వ్యాపార పర్యవేక్షణ మల్లాది శ్రీనివాస్ అలియాస్ బుల్లయ్య నిర్వహిస్తున్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు అతనిని అదుపులోకి తీసుకున్నారు. మద్యంలో కల్తీ చేసి విక్రయాలు జరుపుతున్నట్లు సిట్ విచారణలో బుల్లయ్య అంగీకరించినట్లు సమాచారం. కల్తీ కోసం వాడే కెమికల్స్ ఎక్కడి నుంచి తెస్తారనే విషయాన్ని మాత్రం చెప్పడం లేదు. నగరంలోని అన్ని బార్లలోను కల్తీ జరుగుతున్నట్టు బుల్లయ్య ఇచ్చిన సమాచారం ఆధారంగా కల్తీ మద్యం కేసుతో పాటు ఇతర బార్ అండ్ రెస్టారెంట్ల కార్యకలాపాలపై కూడా దర్యాప్తు చేయాలని సిట్ దర్యాప్తును పర్యవేక్షిస్తున్న నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఆదేశించారు. ఈ నెల 7న కృష్ణలంక స్వర్ణ బార్లో కల్తీ మద్యం తాగి ఐదుగురు మృత్యువాత పడడంతో పాటు 31 మంది అస్వస్థతకు లోనైన సంగతి తెలిసిందే. వీరిలో ముగ్గురి పరిస్థితి నేటికి విషమంగానే ఉంది. కల్తీ మద్యం కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్ బృందం అన్ని కోణాల్లో సమాచారం సేకరిస్తోంది. విచారణలో భాగంగా బుల్లయ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మేనేజర్ కీలకం కల్తీ జరిగిన స్వర్ణ బార్‌కు మేనేజర్‌గా వ్యవహరిస్తున్న వెంకటేశ్వరరావు ఈ కేసులో కీలకమని సిట్ అధికారులు భావిస్తున్నారు. పాతికేళ్లుగా మద్యం షాపుల్లో పనిచేస్తున్న వెంకటేశ్వరరావు కల్తీ కలపడంలో దిట్టగా చెపుతున్నారు. ఇతనిపై ఇప్పటి వరకు 11 కేసులు ఉండగా, మెజారిటీ కేసులు ఎక్సైజు చట్టం కింద నమోదు చేసినవేనని తెలుస్తోంది. తెల్లని సీసాలలో ఉండే కెమికల్ ఒక చుక్కను మాత్రమే కలపాల్సి ఉందని, ఎక్కువ మోతాదులో వెంకటేశ్వరరావు కలిపి ఉండొచ్చని అదుపు ఉన్న బుల్లయ్య సిట్ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. ఆ కెమికల్ మిథనాలా లేక మరొకటా అనేది మాత్రం స్పష్టం చేయలేదని సమాచారం. మరోసారి విచారణలో భాగంగా అరెస్టు చేసిన బార్ ఉద్యోగులను కస్టడీకి తీసుకోవాలనే యోచనలో పోలీసు అధికారులు ఉన్నారు. ఈ మేరకు శుక్రవారం కోర్టులో ఫిటిషన్ దాఖలుచేశారు. అందని నివేదిక కల్తీ మద్యం కేసుపై నివేదిక పోలీసులకు చేరలేదు. ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ పరీక్షల కోసం రక్తం, యూరిన్, విశ్రాతో పాటు శరీరంలోని కొన్ని నమూనాలు పంపారు. ఆయా రిపోర్టులు వచ్చేందుకు మరికొంత వ్యవధి పడుతుందని పోలీసు అధికారులు చెపుతున్నారు. ఈలోగా బార్ ఉద్యోగుల నుంచి మరిన్ని వివరాలు రాబట్టాలని యోచిస్తున్నారు.