ఏఐపీఎంటీకి దరఖాస్తు చేయడమే శాపమా? | Applying for AIPMT is our mistake? | Sakshi
Sakshi News home page

ఏఐపీఎంటీకి దరఖాస్తు చేయడమే శాపమా?

Published Sun, May 1 2016 4:28 AM | Last Updated on Sun, Sep 3 2017 11:07 PM

ఏఐపీఎంటీకి దరఖాస్తు చేయడమే శాపమా?

ఏఐపీఎంటీకి దరఖాస్తు చేయడమే శాపమా?

♦ నేటి పరీక్ష రాయుకపోతే రెండో దశ పరీక్షకు అనర్హులట!
♦ పరీక్షకు వుుందు రోజు ఎస్‌ఎంఎస్‌లు పంపించిన సీబీఎస్‌ఈ
♦ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో లేని పరీక్ష కేంద్రాలు
♦ పరీక్ష రాయూలంటే పుణె, హౌరా, చెన్నై, ఢిల్లీలకు వెళ్లాల్సిందే
♦ ఆందోళనలో వేలాది వుంది మెడికల్ ఆశావహులు
 
 సాక్షి, హైదరాబాద్:
ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్(ఏఐపీఎంటీ)కి దరఖాస్తు చేయడం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు శాపంగా మారింది. ఏఐపీఎంటీని ఇప్పుడు నేషనల్ ఎలిజిబిలిటీ, ఎంట్రెన్స్ టెస్ట్(నీట్)గా మార్పు చేసిన నేపథ్యంలో ఈ పరీక్షకు దరఖాస్తు చేసిన వారు మే 1న జరిగే పరీక్ష కు హాజరు కాకపోతే జూలై 24న జరిగే రెండో దఫా నీట్ పరీక్షకు అనర్హులని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) దరఖాస్తు చేసిన విద్యార్థులందరికీ ఎస్‌ఎంఎస్‌లు పంపింది. దీంతో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పైగా ఏఐపీఎంటీ కోసం తెలుగు రాష్ట్రాల్లో ఒక్క పరీక్ష కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. ఇప్పటికిప్పడు చెన్నై, హౌరా, ఢిల్లీ వంటి ప్రాంతాలకు వెళ్లి పరీక్ష ఎలా రాయగలమని విద్యార్థులు వాపోతున్నారు.

మరోవైపు పుణెలోని ఆర్మ్‌డ్ రిజర్వ్ ఫోర్సెస్ కాలేజీ, ఆల్ ఇండియా మెడికల్ సెన్సైస్ కాలేజీల్లోని 15 శాతం సీట్లకే తాము దరఖాస్తు చేసినప్పుడు రెండో దఫా పరీక్షకు ఎందుకు అనువుతి ఇవ్వరన్న ఆందోళనలో పడ్డారు. ఏఐపీఎంటీని ఒక ఆప్షన్‌గా పెట్టుకునే దరఖాస్తు చేశావుని, దేశవ్యాప్తంగా నీట్‌ను కంపల్సరీ చే సినపుడు తవుకు ఎందుకు రెండో దశలో అవకాశం ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు. ఎంసెట్‌లను రాష్ట్ర ప్రభుత్వాలే  నిర్వహిస్తున్నాయి. అలాంటపుడు రాష్ట్ర ప్రభుత్వాల పరీక్షలను కాదని, నీట్-1కు వెళ్లితే ఇక్కడ సీట్లు కోల్పోవాల్సి వస్తుందేమోనన్న ఆందోళన విద్యార్థుల్లో నెలకొంది. ఇప్పుడు నీట్‌కు దరఖాస్తు చేసిన దాదాపు 10 వేల వుంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎంసెట్‌లను కాదని నీట్ రాస్తే.. దేశవ్యాప్తంగా సీట్లు ఇస్తారా? అంటే అదీ లేదు. తెలంగాణ, ఏపీ, జవుూ్మకశ్మీర్ రాష్ట్రాల విద్యార్థ్థులు ఎయిమ్స్, ఏఎఫ్‌ఎంసీలోని 15 శాతం సీట్లకు మాత్రమే అర్హులు. అలాంటపుడు ఈ 3 రాష్ట్రాల విద్యార్థులు నీట్-1 రాస్తే ఏంటి? నీట్-2 రాస్తే ఏంటి? ఎంసెట్ కాకపోతే ఆ 2 కాలేజీల్లో ప్రవేశాల కోసం ఏఐపీఎంటీని కచ్చితంగా రామలన్న నిబంధన పెట్టడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
 
 నేషనల్ మాల్‌లో లేనపుడు పరీక్ష ఎందుకు?

 2013లో నీట్ పరీక్షను ప్రవేశ పెట్టిన సమయంలో ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అందులో ఉవ్ముడి ఆంధ్రప్రదేశ్, జవుూ్మకశ్మీర్ విద్యార్థులు ఏఎఫ్‌ఎంసీ, ఎరుుమ్స్‌లోని 15 శాతం సీట్లకు వూత్రమే అర్హులని పేర్కొంది. ఇతర రాష్ట్రాలకు చెందిన కాలేజీల్లోని 15 శాతం ఓపెన్‌కోటా సీట్లకు అనర్హులని స్పష్టం చేసింది. నీట్ ద్వారా ఎంపికయ్యే ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఉవ్ముడి ఆంధ్రప్రదేశ్, జవుూ్మకశ్మీర్‌లోని కాలేజీల్లో సీట్లు పొందడానికి అనర్హులని చెప్పింది. అలాంటపుడు ఇక్కడి విద్యార్థులకు నీట్ ఎందుకన్న వాదన వస్తోంది. దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష ద్వారా మెడికల్ ప్రవేశాలు నిర్వహించాలనుకుంటే.. తెలంగాణ, ఏపీలోని విద్యార్థులకు ఎంసెట్ తరహాలో ఇక్కడి ప్రాంతీయ భాష అరుున తెలుగులోనూ(ఇంగ్లిషుతోపాటు) నీట్ నిర్వహించాల్సిన అవసరం ఉంది.

ఎందుకంటే ఇక్కడి సీట్లలో ఇతర రాష్ట్ర విద్యార్థులు రావడానికి వీల్లేదు. జాతీయ స్థాయిలోని ఆ రెండు విద్యా సంస్థలు మినహా ఇతర రాష్ట్రాల్లోని ఏ విద్యా సంస్థలోనూ ఇక్కడి విద్యార్థులు ప్రవేశాలు పొందడానికి వీల్లేదన్న నిబంధన పెడుతున్నాయి. అలాంటపుడు ఇంగ్లిషుతోపాటు ఇక్కడి ప్రాంతీయు భాషలో నీట్ నిర్వహించాలని విద్యార్థులు డివూండ్ చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో 1,00,922 వుంది విద్యార్థుల అగ్రికల్చర్ అండ్ మెడికల్ సీట్ల కోసం దరఖాస్తు చేస్తే అందులో 55 శాతం మంది తెలుగు మీడియుం వారే. ఇక ఏపీలోనూ ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్న 1.30 లక్షల మందిలో సగానికిపైగా తెలుగు మీడియుం వారే. వీరందరికి నీట్ పేరుతో ఇంగ్లిషు లేదా హిందీ ప్రవేశపరీక్ష పెడితే తెలుగు మీడియంలో చదువుకున్న తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement