సిటీలో ముందుగానే వాలంటైన్స్ డే టెన్షన్ | bajrang dal protests over valentine's day at hyderabad kukatpally | Sakshi
Sakshi News home page

సిటీలో ముందుగానే వాలంటైన్స్ డే టెన్షన్

Published Sat, Feb 13 2016 9:30 PM | Last Updated on Wed, Apr 3 2019 7:03 PM

సిటీలో ముందుగానే వాలంటైన్స్ డే టెన్షన్ - Sakshi

సిటీలో ముందుగానే వాలంటైన్స్ డే టెన్షన్

హైదరాబాద్: ఆదివారం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొననున్నాయి. ఆ హీట్ ఒక్కరోజు ముందుగానే సిటీకి తగిలింది. శనివారం సాయంత్రం కూకట్‌పల్లి సుజనాఫోరం మాల్ వద్ద భజరంగ్‌దళ్ కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్తతకు దారితీసింది.

వాలంటైన్స్ డే సందర్భంగా బాలీవుడ్ సింగర్ షాల్‌మలితో కార్యక్రమం నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. దీనిని అడ్డుకునేందుకు భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు యత్నించారు. దీంతో భజరంగ్ కార్యకర్తలను ఫోరం మాల్ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. కొద్దిసేపు ఇరువర్గాలకు మధ్య తోపులాట జరిగింది. వాలంటైన్స్ డేకు వ్యతిరేకంగా భజరంగ్‌దళ్‌, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించే విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement