జంటలు కనిపిస్తే... పెళ్లే | Bajrang dal against valentine day | Sakshi
Sakshi News home page

జంటలు కనిపిస్తే... పెళ్లే

Published Thu, Feb 12 2015 3:16 PM | Last Updated on Mon, Feb 10 2020 3:26 PM

జంటలు కనిపిస్తే... పెళ్లే - Sakshi

జంటలు కనిపిస్తే... పెళ్లే

హైదరాబాద్: ప్రముఖ హిందుత్వ సంస్థ బజరంగ్దళ్ ప్రేమికులకు హుకుం జారీ చేసింది. ఫిబ్రవరి14వ తేదీ ప్రేమికుల రోజు. ఆ రోజు పార్కులు, రిసార్టుల్లో కనిపించే జంటలకు పెళ్లి చేస్తామని బజరంగ్దళ్ రాష్ట్ర కన్వీనర్ భానుప్రకాశ్ హెచ్చరించారు. ప్రేమికుల రోజుకు నిరసనగా గురువారం కోఠిలోని ఆంధ్రబ్యాంకు సమీపంలోని ప్రేమికుల రోజుకు సంబంధించిన గ్రీటింగ్ కార్డులను దగ్ధం చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ... సదరు ప్రేమ జంటలను పట్టుకొని వారి తల్లిదండ్రులకు సమాచారం అందిస్తామన్నారు. అనంతరం వారికి కౌన్సెలింగ్ నిర్వహించి... వారి సమక్షంలోనే పెళ్లి చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement