ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ
కవాడిగూడ : సనాతన ధర్మాలు పాటించే వారితో మాకెలాంటి విభేదాలు లేవని, కేవలం బీజేపీ, దాని అనుబంధ సంస్థలపైనే మా పోరాటమని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. అయోధ్యలో కూల్చివేసిన బాబ్రీ మసీదును పునర్ నిర్మించే వరకూ పోరాటం కొనసాగుతుందన్నారు. ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో ముషీరాబాద్ నియోజకవర్గం భోలకర్‌పూర్‌లోని సుప్రీం హోటల్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన బహిరంగ సభలో అక్బరుద్దీన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో చాయ్ వాలాలు వస్తుంటారు.. పోతుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఒక మతానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, ముస్లింల పట్ల కక్ష సాధింపు ధోరణి కొనసాగుతుందని ఆరోపించారు.
కానీ ముస్లింల సంక్షేమం కోసం అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఒవైసీ నిత్యం పనిచేస్తారని అన్నారు. హిందువులు పవిత్రంగా భావించి ఉపవాసాలతో జరుపుకునే శివరాత్రి పర్వదినానికి రెండు రోజులు సెలవు కావాలని బీజేపీ వాళ్లు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశంలో ఈ విషయంపై ప్రస్తావన తీసుకొస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రీ, మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్, స్థానిక ఎంఐఎం నాయకులు జునైద్ బాగ్దాదీ పాల్గొన్నారు.
బీజేపీపైనే మా పోరాటం
Published Tue, Feb 24 2015 12:09 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement