
ప్రజా రాజధాని ముసుగులో పెద్ద కుంభకోణం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో ప్రజా రాజధాని ముసుగులో పెద్ద కుంభకోణం జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. సీమాంధ్ర...స్కాముల రాష్ట్రంలా మారుతోందని ఆయన వ్యాఖ్యానించారు. బొత్స సత్యనారాయణ శుక్రవారం పార్టీ కేంద్ర కారాల్యయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్రంలో పంచభూతాలను కూడా కబ్జా చేస్తున్నారని, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందంటూ ప్రశ్నించారు.
సింగపూర్ కంపెనీ ప్రతిపాదనలు నష్టదాయకమని, ఆ కంపెనీకి ఏ ప్రాతిపదికన భూములు ఇస్తారని ఆయన అన్నారు. తాము గతంలోనే సింగపూర్ సంస్థలకు భూముల ప్రతిపాదనను వ్యతిరేకించామని బొత్స ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇసుక నుంచి ప్రతిదీ కుంభకోణాలమయంగా మారిందని ఆయన విమర్శించారు.