బాలుడి అనుమానాస్పద మృతి
బాలుడి అనుమానాస్పద మృతి
Published Mon, Feb 6 2017 8:39 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM
జగద్గిరిగుట్ట: అనుమానాస్పద స్థితిలో బాలుడు మృతి చెందిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్టేషన్
పరిధిలో కలకలం రేపింది..పోలీసుల కథనం మేరకు వెంకటేశ్వర నగర్‌కు చెందిన ఆకాశ్(16) అనే బాలుడు ఆదివారం అర్థరాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు రక్తపుమడుగులో పడి ఉండటంతో అతను హత్యకు గురై ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు ఆకాష్ తండ్రి చనిపోవడంతో మేనమామ నర్సింహ్మ ఇంట్లో ఉండేవాడు. అయితే మానసిక స్థితి సరిగ్గా లేదని, తరచూ ఇంట్లో నుంచి బయటకు వెళ్లి రాత్రి పొద్దుపోయిన తర్వాత తిరిగి వచ్చేవాడని నరసింహ తెలిపాడు, తనను ఎవరో కొట్టడానికి వస్తున్నారని, తనకు చేతబడి చేశారని చెప్పేవాడని తెలిపాడు.
అయితే ఆకాశ్ ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో వెంకటేశ్వర నగర్ సమీపంలో తనను కొందరు చంపడానికి వస్తున్నారని, అందుకే పారిపోతున్నానని చెప్పినట్లుగా స్థానికులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ‘మా నాన్నను చంపేశారు నన్ను కూడా చంపేస్తారని’ మృతుడు చెప్పినట్లు ఉన్న వీడియో క్లిప్పింగ్‌లు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
ఆకాశ్ మృతి చెందిన ప్రాంతాన్ని డీసీపీ డాక్టర్ సాయిశేఖర్ పరిశీలించారు. స్థానిక సీఐ శ్రీనివాస్, స్థానికులతో వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Advertisement