పర్యాటకురాలితో క్యాబ్‌ డ్రైవర్‌ వికృత చేష్టలు | Cab driver grotesque activity | Sakshi
Sakshi News home page

పర్యాటకురాలితో క్యాబ్‌ డ్రైవర్‌ వికృత చేష్టలు

Published Wed, Apr 19 2017 2:48 AM | Last Updated on Tue, Aug 14 2018 3:14 PM

పర్యాటకురాలితో క్యాబ్‌ డ్రైవర్‌ వికృత చేష్టలు - Sakshi

పర్యాటకురాలితో క్యాబ్‌ డ్రైవర్‌ వికృత చేష్టలు

వాట్సాప్‌లో ఫిర్యాదు చేసిన బాధితురాలు
నిందితుడిని అరెస్టు చేసిన ‘షీ–టీమ్స్‌’


సాక్షి, హైదరాబాద్‌: బెంగళూరు నుంచి నగర పర్యటనకు వచ్చిన ఓ పర్యాటకురాలికి చేదు అనుభవం ఎదురైంది. ఆమె పట్ల క్యాబ్‌ డ్రైవర్‌ వికృతంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదుతో మంగళవారం నిందితుడిని అరెస్టు చేసినట్లు అదనపు సీపీ (నేరాలు) స్వాతి లక్రా వెల్లడించారు. బెంగళూరుకు చెందిన మహిళ గత వారం కుటుంబీకులతో నగర పర్యటనకు వచ్చారు. సిటీకి చెందిన ఓ ట్రావెల్‌ ఏజెన్సీ నుంచి క్యాబ్‌ను ఎంగేజ్‌ చేసుకున్నారు. ఈ వాహనానికి పహాడీషరీఫ్‌కు చెందిన నలభై ఏళ్ల మహ్మద్‌ సలీం డ్రైవర్‌గా వచ్చాడు. పర్యటన అనంతరం తిరిగి వెళ్లేందుకు అంతా రైల్వే స్టేషన్‌కు బయలుదేరారు.

బాధితురాలు డ్రైవర్‌ పక్క సీటులో కూర్చోగా... కుటుంబీకులు వెనుక సీట్లో కూర్చున్నారు. దారిలో డ్రైవర్‌ సలీం వికృతంగా ప్రవర్తించడం మొదలెట్టాడు. తీవ్ర జుగుప్సకు లోనైన బాధితురాలు కారు ఆపమని చెప్తున్నా వినకుండా ముందుకు వెళ్లాడు. చివరకు బలవంతంగా కారు ఆపించి కిందికి దిగిన బాధితురాలు తన తండ్రితో పాటు బంధువుకు విషయం చెప్పారు. వారు ప్రశ్నిస్తుండగానే.. లగేజ్‌ను నడిరోడ్డుపై పడేసిన సలీం అక్కడి నుంచి ఉడాయించాడు. దీనిపై బాధితురాలు అప్పుడే ట్రావెల్స్‌ నిర్వాహకుడికి ఫిర్యాదు చేసినప్పటికీ సమయాభావంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. బెంగళూరు చేరుకున్న తర్వాత షీ–టీమ్స్‌కు వాట్సాప్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం నిందితుడిని అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement