
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, వైఎస్సార్ కడప: పేద మైనారర్టీలను తక్కువ టికెట్ ఖర్చుతో ఉమ్రాకు పంపిస్తామని ఓ ట్రావెల్ ఏజెన్సీ బడా మోసానికి పాల్పడిన విషయం తెలిసిదే. అయితే ఉమ్రా యాత్ర పేరుతో అమాయకపు ముస్లిం ప్రజలను మోసం చేసిన నిందితులను కడప సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. తక్కువ టికెట్ ధరతో కేఎస్‌ఎస్ ఉమ్రా ట్రావెల్ ఏజెన్సీ యాజమాన్యం దేశ వ్యాప్తంగా వేల మంది దగ్గరి నుంచి కోట్ల రుపాయలను వసూలు చేసింది. ఎంఐఎంకి చెందిన ఓ వ్యక్తితో సహా మరో ఇద్దరు నిందుతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సీసీఎస్ డీఎస్పీ నాగేశ్వర్ రెడ్డి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment