=సకాలంలో సెంటర్లకు చేరుకోలేక అవస్థలు
=ఏపీసెట్‌కు గ్రేటర్‌లోనే సుమారు
=10వేలమంది దూరం
=శివార్లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడమే కారణం
ఉస్మానియాయూనివర్సిటీ,న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్ (ఏపీసెట్-2013) పరీక్ష నగర అభ్యర్థులకు తీరని నిరాశను మిగిల్చింది. నగరంలోని కాలేజీలను వదిలేసి శివారు ప్రాంతాల్లో దూరంగా కాలేజీల్లో సెంటర్లు కేటాయించడమే ఇందుకు కారణం. ఈ ప్రాంతాల్లోని వృత్తివిద్యా కాలేజీల్లో పరీక్ష నిర్వహించడం వల్ల రూట్‌మ్యాప్ తెలియక చాలామంది సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోలేకపోయారు. ట్రాఫిక్ వలయాన్ని ఛేదించుకొని సిటీకి ఎటూ 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కేంద్రాలకు చేరుకునే సమయానికి తీరా సమయం ముగియడంతో నిరాశతో వెనుతిరుగాల్సి వచ్చింది.
ఒక్క నగరం నుంచే ఏపీసెట్‌కు మొత్తం 35,289 అభ్యర్థుల పరీక్షకు దరఖాస్తు చేసుకోగా,వీరిలో 25,827 మంది మాత్రమే హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల ఎంపికపై అధికారులకు ముందుచూపు లేకపోవడంతో గర్భిణులు, బాలిం తలు, అంధులు, వికలాంగులు నానాఇబ్బం దులు పడ్డారు. కార్పొరేట్‌స్థాయి హంగులతో కూడిన పా ఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు ఉన్నా.. వాటిని కాదని దూరంగా ఉన్న గండిపేట, ఇబ్రహీంపట్నం, ఇబ్రహీంబాగ్, ఆర్సీఐ, తదితర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను ఎంపిక చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో కష్టపడి చదివిన అభ్యర్థులు పరీక్ష రాయక కన్నీళ్లు పెట్టుకొని వెనుదిరిగారు.
రైల్వే పరీక్ష వల్లే : ఏపీసెట్ నోటిఫికేషన్‌కు ముందే నగరంలోని పలు కళాశాలలు,పాఠశాలలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ముందుగా రిజర్వు చేసుకుందని, దీంతో శివా రు ప్రాంతాల్లోని కాలేజీలను ఎంపిక చేయాల్సి వచ్చిందని ఏపీసెట్ 2013 సభ్యకార్యదర్శి రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. 15 రోజుల ముందే హాల్‌టికెట్లను పంపిణీ చేశామని చెప్పారు.
అభ్యర్థులు ‘అప్‌సెట్’
Published Mon, Nov 25 2013 3:52 AM | Last Updated on Sat, Sep 22 2018 8:06 PM
Advertisement
Advertisement